న్యాయాలు-900
*నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్" న్యాయము
****
న అనగా లేదు, కాదు.హి అనగా నిస్సందేహంగా.కశ్చిత్ అనగా ఏ మానవుడు కూడా.క్షణం అనగా రెప్పపాటు.అపి అనగా అయినప్పటికీ.జాతు అనగా ఏ సమయంలో కూడా. న తిష్ఠతి అనగా ఉండలేడు. అకర్మ కృత్ అనగా ఏ పని చేయకుండా అని అర్థము.
ప్రతి వాడూ ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాడు.
దీనికి సంబంధించిన శ్లోకం మొత్తం భగవద్గీతలో వుంది.అదేమిటో చూసి ఈ న్యాయము యొక్క పూర్తి అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుందాం.
"న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్!/ కార్యతే హ్యవశఃకర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః!!"
అనగా నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలం అయినా వుండలేడు.ఎందుచేతనంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోందని ఆధ్యాత్మిక వాదులు చెబుతుంటారు.
మరి ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలేవి? అనే సందేహం మనకు కలుగుతుంది.ప్రకృతి త్రిగుణాల సమాహారమని పెద్దలు అంటుంటారు.మరి ఆ త్రిగుణాలు ఏమిటో మనకు తెలుసు. అవే సత్త్వ గుణం, రజోగుణం,తమో గుణాలు.ఈ గుణాలతో నిండిన వ్యవస్థనే ప్రకృతి అంటారు.
ఈ గుణాలు జీవాత్మలలో అనగా (జీవించి ఉన్న ఆత్మలు) మానవులలో ఉంటాయి.ఆ గుణాలు కలిగిన మానవుల వివిధ కర్మలే ప్రకృతి. కాబట్టి ప్రకృతిని ఒక మహా కర్మఫల సముద్రమని అనవచ్చు.అది నిరంతరం చలిస్తూనే ఉంటుంది.
చలించే ప్రకృతి అనే మహా సముద్రంలో ప్రతి మనిషి ఒక అల వంటి వాడు.అలలాంటి వాడు కాబట్టే "అల జడి' వుంటుంది.
ఆ విధంగా లోలోపల అలజడులతో మనిషి జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు.కనుకనే మనిషిని కర్మలలోంచి పుట్టిన వాడు.కర్మ సంజాతుడు అని అంటారు.
అల ఏవిధంగానైతే క్షణమైనా ఆగదో మనసు, బుద్ధి ఉన్న ఏ మనిషి కూడా మెలకువగా ఉన్నప్పుడు/ ఉన్నంతసేపూ ఏ పనీ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండడు.ఉండలేడు.
అదెలా అంటే శరీరం విశ్రాంతిగా ఉన్నా లేకపోయినా ,మనసులో ఏవేవో ఆలోచనలు సుడులు తిరుగుతూనే ఉంటాయి. ఇక మామూలుగా చెప్పాలంటే మనకు తెలియకుండానే గాలి పీలుస్తూ ఉంటాం తినకుండానో, తిరగకుండానో, త్రాగకుండానో, లేచి వివిధ పనులు చేయకుండానో ఏ వ్యక్తి ఉండడు..
అందు వల్ల మనిషి ఎప్పుడూ కర్మ శూన్యుడు కాలేడు.కర్మలను చేయకుండా ఉండలేడు.అనగా మనో వాక్కాయముల చేత కర్మలు చేస్తూనే ఉంటాడు.ప్రకృతి నుండి పుట్టిన త్రి గుణములు. మనిషిని ఆకర్షించి కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి.ఇష్టమున్నా లేకున్నా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి.ఏ కర్మా చేయకుండా ఉండలేము.*
ఈ "నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ న్యాయము ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఏ కర్మ చేయకుండా ఉండడం అసాధ్యం. కాబట్టి మనం చేసే కర్మలు సమాజ హితంగా ఉండాలి. అయితే జితేంద్రియులమై జ్ఞానులుగా సంచరించ గలిగితే త్రి గుణములలో ఏ గుణము అంటదని చెబుతుంటారు కనుక ఈ రెండింటిలో ఏదో ఒక జీవితాన్ని మనం ఎంచుకోవాలి. అప్పుడే తృప్తి, ముక్తి లభిస్తాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి