“నాకు చదవడం, రాయడం బాగా రాదు... కానీ నేను ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకదాన్ని నిర్మించాను...."
నా బాల్యం తుఫానులా గడిచింది. 9 సంవత్సరాల వయసులో, నేను సైకిల్ దుకాణంలో అప్రెంటిస్‌గా పని చేయడానికి పాఠశాల మానేశాను. మాది పేద కుటుంబం. చదువుకునే అవకాశం లేదు. ఈ స్థితిలో నా చేతులే నాకు ఉపాధ్యాయులయ్యాయి. ఏవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అది నానాటికీ అంతులేనిదైంది. నేను విద్యుత్తును కనుగొన్నప్పుడు, నాకు తెలుసు: నేను నిర్మించడానికి సహాయం చేయాలనుకుంటున్న భవిష్యత్తు ఇదేనని గ్రహించాను.
సంవత్సరాల తరువాత, ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తూ, నేను సురక్షితమైన, మరింత సమర్థవంతమైన ఎలక్ట్రికల్ ప్లగ్‌ను కనుగొన్నాను. మొదట్లో నా యజమానులు దీనిని నమ్మలేదు. వారు నా ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు. కాబట్టి నేను మానేశాను. దాదాపు ఏ ఆశ లేకుండా, నేను నా భార్య, బావమరిదితో కలిసి ఇంట్లో ప్లగ్‌లను తయారు చేయడం ప్రారంభించాను. మాకు ఉపకరణాలు లేవు. క్లయింట్లు లేర. మాకు ఉన్నవంతా విశ్వాసం, దృఢం సంకల్పం. పట్టుదల. ప్రారంభంలో కొన్ని రోజులపాటు మేము ఒక్క స్క్రూ కూడా అమ్మలేకపోయాం. మా వద్దకు వచ్చేవారు కానీ కొనుక్కోవడానికి ఆలోచించి వెనక్కెళ్ళిపోయేవారు. అయినప్పటికీ మేము మా ఆసక్తినీ, ఆశను వదులుకోలేదు.
రోజులు గడిచేకొద్దీ కొంచెం కొంచెంగా మేము తయారు చేసిన ప్లగ్గులు అమ్ముడుపోవడం ప్రారంభించాయి. మాలో నమ్మకం పెరిగింది... 1918లో, నేను నా స్వంత కంపెనీని స్థాపించాను. దాని పేరు మత్సుషితా ఎలక్ట్రిక్. తరువాత ప్రపంచం మమ్మల్ని పానాసోనిక్ అని పిలిచింది. మేము భూకంపాలు, యుద్ధాలు, బాంబు దాడులు, ఆర్థిక సంక్షోభాల నుండి బయటపడ్డాము. కానీ ఉపయోగకరమైన సాంకేతికతతో ప్రజలకు సహాయం చేయాలనే కలలు కనడం నేను ఎప్పుడూ ఆపలేదు. రేడియోలు, టీవీలు, గృహోపకరణాలు - కారు బ్యాటరీలు వంటివాటితో ప్రపంచానికి మరింత చేరువయ్యాం.
“పేదరికమే నాకు తక్కువ ఖర్చుతో ఓ తయారీకి పునాదైంది. వైఫల్యం నాకు పట్టుదల నేర్పింది. దార్శనికత నన్ను ముందుకు నడిపించిందన్నారు కోనోసుకే మత్సుషితా (Konosuke Matsushita). 1894 నవంబర్ 27న జన్మించిన ఈయన 1989 ఏప్రిల్ 27న తుదిశ్వాస విడిచారు. ఈయన జపానులో అతిపెద్ద సంస్థయిన పానాసోనిక్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని స్థాపించిన మేటి పారిశ్రామికవేత్త. మత్సుషితాను జపాన్‌లో "గాడ్ ఆఫ్ మేనేజ్‌మెంట్" అని పిలుస్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి