డ్రైవర్ తీరు!:- - యామిజాల జగదీశ్
 జపాన్ రాజధాని టోక్యోలో, ఒక విదేశీ వ్యక్తి టాక్సీ ఎక్కాడు. భాషా అవరోధం కారణంగా, అతను పెద్దగా చెప్పలేకపోయాడు. కేవలం  అతను వెళ్తున్న ఇన్ స్టిట్యూట్ పేరు మాత్రమే చెప్పాడు. డ్రైవర్ మర్యాదతో " సరే, ఎక్కండి" అన్నిట్లు తల ఊపాడు సాదరంగా తలుపు తెరిచి. జపనీస్ మర్యాదకు అనుగుణంగా అతన్ని లోపల కూర్చోమన్నాడు.
డ్రైవర్ ఎప్పటిలాగే మీటర్‌ యాక్టివేట్ చేశాడు. కానీ కొంత సమయం తర్వాత, అతను అకస్మాత్తుగా మీటర్ ని ఆఫ్ చేశాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత మీటరుని తిరిగి ఆన్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న ప్రయాణికుడు డ్రైవర్ ఎందుకలా చేశాడో అర్థం కాలేదు. భాష తెలీకపోవడంతో ఏమీ  అడగలేదు కానీ ఆశ్చర్యపోయాడు ప్రయాణికుడు. 
తీరా గమ్యస్థానానికి చేరుకోవడంతోనే ప్రయాణికుడు ఇన్ స్టిట్యూట్ లో ఉన్న ఒకతనితో మాట్లాడుతూ మార్గమధ్యంలో డ్రైవర్ ఎందుకు మీటర్ ఆఫ్ చేశాడో, తర్వాత ఎందుకు ఆన్ చేశాడో అడగండి అని చెప్పాడు.
అప్పుడా ఇన్ స్టిట్యూట్ మనిషి
సరే నని ఏమిటి సంగతి అని డ్రైవరుని అడిగాడు. 
*అదా" అంటూ డ్రైవర్ ... "నేను దారిలో పొరపాటు చేసాను. నేను కుడి మలుపులో తిరగవలసింది తిరగక  పొరపాటున మరొక మలుపులో తిరిగాను. దీంతో చాలా దూరం వెళ్ళాక గానీ  మళ్ళీ సరైన దారిలోకి రాలేకపోయాను.  ఇక్కడ నా పొరపాటు వల్ల అదనపు దూరం ప్రయాణించాల్సి వచ్చింది. ప్రయాణీకుడు చేయని తప్పుకి నేను ఆయన నుంచి అంత దూరానికీ అదనపు ఛార్జీ వసూలు చేయలేను కదండీ. అందుకని పొరపాటున వెళ్ళిన రూటులో వెళ్ళినంత సేపూ మీటరు ఆఫ్ చేసి ఉంచాను. సరైన మార్గంలోకి వచ్చాక మీటర్ మళ్ళీ ఆన్ చేశానండి" అని ఎంతో అణకువతో వివరణ ఇచ్చాడు.
డ్రైవర్ సత్ప్రవర్తనకు, నిజాయితీకి ఈ వివరణ ఒక చక్కటి  ఉదాహరణ కదూ!!

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం