అల్లకల్లోలమైన మనసును
ఆహ్లాదపరిచే ఆవిష్కారంగా
అంతులేని ఆలోచనలను
ఆపే నిశ్శబ్దమైన విస్ఫోటనంలా
కొత్త దారిని చూపించి
చెత్త ఏదో విడమరచి
చిత్త శాంతిని పొందమని
మెత్తగా మందలిస్తూ....
చేయక తప్పని యుద్దానికి
మనసును సిద్ధం చేసి
తనువు లోని ఆణువణువూ
కదనానికి కదిలేలా కవ్విస్తూ...
వంద నిందలు భరించేలా
వేల నిష్టురాలు తట్టుకునేలా
కోటి ప్రశ్నలను ఎదుర్కొనేలా
మస్తిష్కాన్ని మలచుకొమ్మంటూ..
అపజయాలు ఒప్పుకుంటూ
అబద్దాలను తప్పుకుంటూ
అందినవి అంగీకరిస్తూ...
అసంతృప్తికి తావు లేక సాగే..
ఉజ్వలమైన జీవితం కోసం
ఉత్సాహం ఊపిరి చేసుకుని
ప్రయత్నం చేయడంలో
పరాకు కూడదని... పాఠం చెబుతూ
వచ్చే వేకువ వెలుగులకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి