ఓ! ద్వాంక్షమా! అసమానతలకు అతీతులై
సంఘీభావం ,సేవా తత్పరత,
అన్యోన్యం ,ఐక్యతకు ఆదర్శం నీవు.
సమయపాలనకు నీకు సాటి ఎవరు??
సూర్యాస్తమయం గుర్తెరిగి
సమయానికి గూటికి ఎగిరే
సులక్షణ జీవివి నీవు.
ఎంతటి సలక్షణమే నీది!!
సంధ్యా సమయం అనంతరం
ఆహారం ముట్టని సద్గుణమే నీది.
నీ అరుపులోనే, అలజడి తోనే
బంధువుల రాకను బహు చక్కగా తెలుపుతావు.
గ్రహణాలు విడిచాక
స్నాన మాచరిస్తావని
కవులు వర్ణించారు నిన్ను
కాలజ్ఞానివని. ..
ప్రకృతి వైపరీత్యాలు తెలుసు.
భూ ప్రకంపనలు తెలుసు.
ప్రమాదాల్ని పసిగట్టి...
బందు మిత్ర వర్గాలతో
రెక్కల రెపరెపలు చేసి
మా కెచ్చరికలు చేస్తావ్.
జీవపరిణామందున ఎన్ని
పక్షి జాతులున్న..
కాకిలా కలకాలం జీవించమన్నారే
మునుపటి రోజున
భోజన సమయాన
గోడ గూటిని నీకు మొదలు పెట్టాకే ముద్ద
తర్వాత జనం నోట్లో ముద్ద.
వెంగిలి చేతితో కాకిని కొట్టరని
దానధర్మ మందున
నీ పేరే ముందుగా మరి!
మానవ అంతిమ పయనం
దేహ దహనం. .
ముచ్చటగా మూడో రోజు
నీ కొరకై . . కైమోడ్పులు
నువ్వు తాకినాకే కదా!
నరుని ఆత్మకి శాంతి.
అందుకే!ద్వాంక్షమా నీకు దండమా !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి