స్ఫూర్తిదాతలు..సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 కర్నాటక లోని అర్జి అనే కుగ్రామంలో గణేష్ ఓ కాంట్రాక్టర్.రెండుసార్లు పంచాయతీసర్పంచి గా తన సొంత ఖర్చుతో కొందరికి విద్యుత్తు సౌకర్యం కల్పించి 150మందికి కరెంట్ బిల్లులు కడుతున్నాడు.కోటిరూపాయలఖర్చుతో 20ఇళ్లు కట్టించిన అతను కౌలు సమస్య లేకుండ రైతుల కి వ్యవసాయ సదుపాయాలు కల్పిస్తున్నారు.తమిళనాడుకు చెందిన  దురై తమ్ముడు యాంబులెన్స్ ఆలస్యంగా రావడంతో చనిపోయాడు.అంతే,అప్పటినుంచి 5యాంబులెన్స్లుకొని సొంత ఖర్చులతో పేషెంట్స్ ని తీసుకెల్తున్నాడు.100మందికి ఫ్రీగా మందులు కొనిస్తున్నాడు.అనాధాశ్రమాల్లో కేవలం 18ఏళ్లదాకానే ఉండనిస్తారు.ఆపై వారి పాట్లు వారు పడాల్సిందే! అలాంటివారికి అద్దె,ఫీజులు కడ్తున్న  దురై కన్న మించిన దానకర్ణులేరీ?కేరళకి చెందిన  పీటర్ ఆయుర్వేద మొక్కలను పెంచుతూ మేకల ఫాం నెల కొల్పాడు. పేద వారికి ఫ్రీగా 4మేకలు ,రైతులకు ఆవుదూడల్ని ఇస్తున్నారు.సొంతంగా ఫామ్ టూరిజం ఏర్పాటుచేసి ఓషధీమొక్కల్ని విదేశీ జంతువులను జనాలకి పరిచయం చేస్తున్నారు.మరి ప్రభుత్వ పథకాలు అన్నీ పక్క దారి పడుతూ రొక్కాన్ని నొక్కేసే ప్రబుద్ధులు ఉన్న కాలంలో50మంది ఒంటరి వృద్ధులకు అన్నదానం చేస్తున్న ఆయన ఆదర్శ ప్రాయుడు🌹
కామెంట్‌లు