"కావాలి":- ---డా.పోతగాని సత్యనారాయణ

(ఒత్తులు లేని బాల గేయం-2)
వానలు కురవాలి - వాగులు పారాలి
చెరువులు నిండాలి - చేలే తడవాలి

మొలకలు లేవాలి - చివురులు తొడగాలి
పూవులు పూయాలి - పంటలు పండాలి

సాయం రావాలి - దానం చేయాలి
చదువులు సాగాలి - బతుకులు మారాలి

చిలుకలు పలకాలి - చీమలు బతకాలి
గోవులు పెరగాలి - జీవులు నిలవాలి

కలతలు తొలగాలి - కలుములు కూడాలి
మనసులు కలవాలి - మమతలు పంచాలి

ఆకలి తీరాలి - అందరు ఎదగాలి 
ఆశలు మెరవాలి - దేశం గెలవాలి


కామెంట్‌లు