సాహితీ కవి కళా పీఠం
================
భారం మోసే వేర్లను భూమిలోకి చెప్పించి ...,
నీడను ఇచ్చే కొమ్మలను గాలిలో విస్తరించి ..,.
పశుపక్షాదులకు ఉచిత ఆశ్రయమిచ్చి ....,
రంగురంగుల కుసుమాల సుమ పరిమళాలను వెదజల్లుచూ....,
విషవాయువులను సునాయాసంగా నువ్వే పీల్చేసి ....,
ప్రాణవాయువులను తృణపాయంగా మాకు వదిలేసి ....,
పరుల కోసం జీవిస్తూ ,అందరినీ మెప్పించి ...,
పచ్చగా నిలిచావు స్వార్థాన్ని తుంచేసి .
నీ నీడను చల్లగా గూడుగా మార్చేసి ....
కొమ్మలను ఊయలగా ఊడలగా దించేసి...
రుషిగా మారేసి వీక్షిస్తున్నావు మనిషి స్వార్ధాన్ని మౌనంగా .
నిలిచావు నీవునీతో మాట్లాడని మనిషికి కూడా మనుగడకు ఆధారంగా .
మారిన ఓ మహోన్నత వృక్షరాజమా !
మనుషులతో ఎన్నడూ మాట్లాడుకుమా !
వెన్నుపోటు దగా రాజకీయాలు ,
స్వార్థపూరితపు విషద్వేషాలు ,
మనిషి దగ్గర నేర్చుకోవద్దమ్మా !
నీవు నీలాగే నిస్వార్ధంగా చెట్టులా బ్రతుకమ్మ!
వద్దు మనిషితో మాటలు వద్దు:- పార్లపల్లి నాగేశ్వరమ్మ- నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి