బిడ్డల కనీస ధర్మం...!: - కోరాడ నరసింహా రావు .
ఫాదర్స్ డే శుభాకాంక్షలతో....
=====================
ఎంతో ఆశతో ఈ భూమి మీద మనరాక కొసమెదురుచూసేది...నాన్నే...!

బిడ్డనుచూసి అమితంగా మురిసిపోయేదీ నాన్నే...!

బిడ్డలను భుజాల కెత్తి కుని ...
  ప్రపంచాన్ని చూపించేవాడు నాన్న!

తన చిటికెన వేలు నందించి....
   నడక నేర్పేవాడే నాన్న..!

మన ఎదుగు దలను చూసి లోలోన మురిసిపోతాడు నాన్న...!

బిడ్డ సుఖం కోసం ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో స్వీకరించేవాడే నాన్న...!

కన్న బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ...
  ఆహరహమూ తపించి,శ్రమించేవాడే నాన్న..!

మన అభ్యున్నతి వెనుక కనిపించని పరిశ్రమే నాన్న !

కన్నది అమ్మే ఐనా...
    కారకుడు నాన్నె గా...!

మనకు గుణాలు సంక్రమించేది నాన్ననుండే...!

నాన్నకు ప్రతి రూపాలమే మనం...!

జన్మ నిచ్చిన తల్లితరువాత...
   తండ్రే మనకు ప్రత్యక్ష దైవం....
  అందుకే...పితృదేవో భవ అంటూ తండ్రికి దైవ సమంగా నమస్కరించడం ..!!

ఏమి చేసినా తండ్రి ఋణం తీరనిది...!

కనీసం...వృద్ధాప్యంలో వారిని అనాథలను చెయ్యకుండా....
  ఆదరించడం, బిడ్డల కర్తవ్యం ,కనీస ధర్మం...!!
       *****

కామెంట్‌లు