సాహితీ కెరటాలు
============
కాసిన్ని నీళ్ళకే ఏపుగా పెరిగేవు.
గుసగుసగా ఏవేవో మాటలే చెప్పేవు.
చిన్ని మొక్కవు నీవు
వృక్షమై ఎదిగావు..
చిరు స్పర్శకే నీవు ఉబ్బితబ్బిబయ్యేవు.
పచ్చని ఆకులతో కనువిందు చేసేవు..
నీ నీడలో చల్ల గాలినే పంచేవు.
పువ్వులు,పండ్లతో ఊరించి నవ్వేవు.
నీ కొమ్మలనే నాకు ఊయలగా చేసేవు..
కళ్ళకు ఇంపుగా పచ్చగా స్వేచ్చగ.
అలరించు ప్రాణమా! రుణమెలా తీర్చుకోను..
వచ్చి పోవు అతిథులకు
చిరునవ్వు చిందిస్తూ..
ప్రేమగా పలకరింపు,మంచులా చిలకరింపు..
వాలినా, వంగినా ధీమాగా ఉంటావు..
చుక్క వర్షపు తడికి పచ్చగా కులికేవు.
నిలువునా కూల్చినా తిరిగి మొలకెత్తేవు..
ఆకుపచ్చగ నీవు కనువిందు చేసేవు..
పర్యావరణ పరిరక్షణలో భాగంగ..
స్వచ్ఛతను నింపేవు.
ఓ వృక్షరాజమా!మము కాచు నేస్తమా!
కలకాలం చెలిమితో సాగేము మిత్రమా..!!
============
కాసిన్ని నీళ్ళకే ఏపుగా పెరిగేవు.
గుసగుసగా ఏవేవో మాటలే చెప్పేవు.
చిన్ని మొక్కవు నీవు
వృక్షమై ఎదిగావు..
చిరు స్పర్శకే నీవు ఉబ్బితబ్బిబయ్యేవు.
పచ్చని ఆకులతో కనువిందు చేసేవు..
నీ నీడలో చల్ల గాలినే పంచేవు.
పువ్వులు,పండ్లతో ఊరించి నవ్వేవు.
నీ కొమ్మలనే నాకు ఊయలగా చేసేవు..
కళ్ళకు ఇంపుగా పచ్చగా స్వేచ్చగ.
అలరించు ప్రాణమా! రుణమెలా తీర్చుకోను..
వచ్చి పోవు అతిథులకు
చిరునవ్వు చిందిస్తూ..
ప్రేమగా పలకరింపు,మంచులా చిలకరింపు..
వాలినా, వంగినా ధీమాగా ఉంటావు..
చుక్క వర్షపు తడికి పచ్చగా కులికేవు.
నిలువునా కూల్చినా తిరిగి మొలకెత్తేవు..
ఆకుపచ్చగ నీవు కనువిందు చేసేవు..
పర్యావరణ పరిరక్షణలో భాగంగ..
స్వచ్ఛతను నింపేవు.
ఓ వృక్షరాజమా!మము కాచు నేస్తమా!
కలకాలం చెలిమితో సాగేము మిత్రమా..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి