శ్రీ శంకరాచార్య విరచిత దశశ్లోకీ:-కొప్పరపు తాయారు

 శ్లోకం :  
 న సాంఖ్యం న‌ శైవం న‌ తత్ పాంచరాత్రం 
న‌ జైనం న మీ మాంస కాదేర్మతం వా! 
విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్టః
        శివః‌ కేవలోహమ్!!

భావం:సాంఖ్య,శైవ, పాంచరాత్ర,జైన,మీమాంస,
తర్కికాది  మతములు తత్ పద  అర్ధమగు పరబ్రహ్మ మును ప్రతిపాదింపకుండుట వలన అవి
యుక్తి యుక్తములు కావు,విశుధ్ధాత్మ స్వరూపత్వ హేతు- విశిష్టమగుట‌ వలన అనగా సవికల్పానుభూతికంటే భిన్న మును దాని, తత్వమస్యాది-జన్యమును అగు ఏ అఖంఢ నిర్వికల్పానుభూతి కలదో,దానివలన నేను అద్వితీయ వరిశిష్ట శివస్వరూపుడను .
               *******

కామెంట్‌లు