కవితల పోటీల్లో తిరుమలరావుకు బహుమతి

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, జాతీయ స్థాయి కవితల పోటీలో తృతీయ స్థానంలో నిలిచారు. విమల సాహితీ సమితి వారు అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీల్లో తిరుమలరావు పాల్గొని, కవిత పంపగా న్యాయనిర్ణేతలబృందం తృతీయ స్థానానికి ఎంపిక చేసి ప్రశంసాపత్రం పంపారు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా త్యాగధనుడు నాన్న అను అంశంపై కవితల పోటీలను నిర్వహించగా తిరుమలరావు పంపిన నేస్తమై, దైవమై, నాన్నవై అను కవిత తృతీయ బహుమతికి ఎంపికైంది. 
విమల సాహితీ సమితి అధ్యక్షులు డా.జెల్ది విద్యాధర్ ఆధ్వర్యంలో, తురుమెళ్ళ కల్యాణి సమన్వయంతో పోటీలు నిర్వహించగా, శైలజామిత్ర న్యాయనిర్ణేతల బృందం తిరుమలరావును అభినందిస్తూ ప్రశంసాపత్రం పంపించారు. అమ్మ గోరుముద్దల వెనక మనోధైర్యం, తీరైన పెంపకమనే మూర్తిమత్వం, నీతికై మానవజాతికై నిలవాలన్న తపోధనం, స్వర్ణమంటి భవితవ్యానికి స్ఫూర్తిదాయకం నాన్న అంటూ తిరుమలరావు తన కవితలో చాటి చెప్పారు. అమ్మలా, అన్నలా, నేస్తమై, దైవమై మా మదిన కొలువున్న ఘనుడు మా నాన్న త్యాగధనుడు మానాన్న అంటూ వివరించారు. అర్ధాకలితో తానుంటూ తమ ఆకలిని తీర్చేటి నాన్న సహనాన్ని త్యాగాలను గూర్చి తిరుమలరావు తన కవితలో స్పష్టపరిచారు. కవిత పంపి తృతీయ బహుమతిని సాధించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు