సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు================క్షీరసాగర మథనంలో తొలుత పుట్టె గరళం,దేవదానవ బృందం యోచించి పరమేశుని వేడగా,పాపహరుడైన శివుడు విషాన్ని కంఠంలో నిలుపుకొనె.విశ్వ హితం కోరి శివుడయ్యె నీలకంఠుడు.విశ్వ మానవాళిపై వాత్సల్యం చూపి,దయాసింధువు,పార్వతీపతి జగద్రక్షకుడిగా నిలిచె!ప్రాణికోటి జీవనాధారమైన గంగ,దివి నుంచి తరలిరాగా,జటాజూటమున నిలువరించి,భూలోకవాసులను,పశువులు,పక్షులు జీవులను సంరక్షించె!గంగాధరుడు జలాభిషేకంతో సంతోషించి,భక్తుల కోర్కెలు తీర్చే లింగరూపుడు.మహాశివరాత్రిన ఉద్భవించిన సదాశివుడు,మనసారా అర్చించిన వారికి వరాల జల్లు కురిపిస్తాడు.నాగాభరణాన్ని ధరించిన అభయ ప్రదాత.లయకరుడు,స్థితికారుడు,ఆదిదేవుడిగా,దేవతలచే ప్రథమంగా పూజింప బడిన కరుణామూర్తి!
కరుణామూర్తి:- కాటేగారు పాండురంగ విఠల్-హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి