సునంద భాష్యం :- ,వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-898
"తత్థ్సానాపన్న స్తత్కార్యం లభతే" న్యాయము
****
తత్ అనగా అది,ఆ. ఆపన్న అనగా సాధన.సత్కార్యం అనగా మంచి పని లేదా ధర్మ బద్ధమైన పని. సత్కారం అనగా గౌరవం.లభతే అనగా పొందుతాడు,తెచ్చుకుంటాడు అనే అర్థాలు ఉన్నాయి.
ఎవరు ఏ యోగ్యత కలిగి ఉంటాడో, దానికి తగినట్టు గౌరవము పొందుతాడు అని అర్థము.
యోగ్యత అంటే అర్హత., మంచితనము. ఒక ఉద్యోగి తాను పనిచేసే స్థానంలో లేదా రంగంలో తగిన జ్ఞానం మరియు నైపుణ్యాలను అన్వయించుకునే  సామర్థ్యాన్ని సమర్థత అంటారు. ఆ  సమర్థతను, సామర్థ్యాన్ని బట్టి ఆ వ్యక్తియొక్క స్థాయి నిర్ణయించబడుతుంది.
ఇక మూడో కోణంలో రాసిన రాతలను చూస్తే మనకు అవగాహన కలుగుతుంది . యోగ్యతను  సమర్థత అని కూడా అంటారు.
,వేర్వేరు వ్యక్తుల వివిధ యోగ్యతా ప్రమాణాలను బట్టి గౌరవం కూడా లభిస్తుంది.అయితే ఆయా వ్యక్తుల సామర్థ్యం, నైపుణ్యం, ప్రతిభను బట్టి యోగ్యతను బట్టి గుర్తింపు లభిస్తుంది. 
మరి అందరం మనుషులమే కదా! ఇందులో ఇంకా యోగ్యత ఏమిటి అని అనిపిస్తుంది. యోగ్యత గురించి తెలుసుకుంటే గౌరవం గురించి అవగాహన వస్తుంది.
దీనికి ఉదాహరణగా వైద్య విభాగాన్ని గురించి చెప్పుకోవచ్చు.ఆయా  సేవ చేస్తుంది. నర్సు లేదా సిస్టర్ సేవ చేస్తుంది.ఏదో ఒక  వైద్యంలో పట్టా పుచ్చుకున్న వైద్యుడు వైద్యం చేస్తాడు . అయితే వీరిలో స్థాయిని బట్టి చూస్తే ఆయా చేసేది సేవే అయినప్పటికీ నర్సు చేసే సేవకు సంబంధించి ఆయా చేయలేదు.
అలాగే వైద్యునిగా రోగానికి సాంబ సంబంధించిన ఔషధాలు,చికిత్స, సేవ మొదలైనవి నర్సు  చేసే సేవ కంటే విలువైనది.  వైద్యుడు ప్రాణాపాయం నుంచి గట్టెక్కిస్తాడు.ఇలా ముగ్గురూ మూడు స్థాయిలు, మూడు రకాల యోగ్యతలు కలిగి వున్నారు.ఆ స్థాయిని బట్టి గౌరవం పొందుతారు.
భగవద్గీతలో ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు భగవంతుని సాన్నిహిత్యం కోసం అవసరమైన జ్ఞాన యోగ,కర్మ యోగము,భక్తి యోగము,ధ్యాన యోగం, ఆత్మ విమర్శ వంటి వాటి ద్వారా వ్యక్తికి ఆధ్యాత్మిక యోగ్యత లభిస్తుంది.
ఇలా "తత్థ్సానాపన్న స్తత్కార్యం లభతే న్యాయము" ద్వారా యోగ్యతను బట్టి గౌరవం లభిస్తుందని మనం తెలుసుకున్నాం.
వ్యక్తి యొక్క యోగ్యతను సామర్థ్యం, నైపుణ్యం, జ్ఞానం, నైతిక, మానవీయ విలువలు, ధర్మ వర్తన, వృత్తి పట్ల నిబద్ధత అంకిత భావంతో కూడిన ఆచరణ అనే అంశాలు నిర్ణయిస్తాయి.వాటిని బట్టే ఇంటి బయట గౌరవం లభిస్తుంది.
ఈ సందర్భంగా యోగ్యత లేని కొందరి గురించి ఉదాహరించిన సుమతీ శతక పద్యాన్ని కూడా చూద్దామా...
 కొందరు యోగ్యత లేని వారు కూడా పదవులు అధికారాలలో ఉంటున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు సుమతి శతక కర్త చెప్పిన కనకపు సింహాసనమున/ శునకమును గూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్/వొనరగ పట్టము గట్టిన/ వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!"
అనే పద్యం  వెంటనే గుర్తుకు వస్తుంది . ఏ రంగంలోని వారినైనా గౌరవించాలంటే మనసు ఒప్పుకోదు.కాబట్టి ఏ వృత్తి చేసినా  మనిషిగా మన యొక్క అర్హతలను మరిచిపోకుండా గౌరవాన్ని పొందాలి.

కామెంట్‌లు