కలము పట్టటం
కైతలు రాయటం
భావాలు తెలపటం
ఏమాత్రము కాదుదోషం
రాయకపోతే కవితలు
కవులను ఎవ్వరు
నచ్చరు మెచ్చరు
తిట్టరు తలచరు
కుకవితలు రాయటం
పాఠకులను శిక్షించటం
అమాయకులను బాధించటం
శాపనార్ధాలకు గురికావటం
కవనాలు కీర్తించటం
కవికికీర్తీ తేవటం
ఆలోచనలు లేపటం
మదులందు నిలవటం
కవితల పఠనం
చల్లాలి సౌరభం
ఇవ్వాలి తియ్యదనం
కూర్చాలి కమ్మదనం
అక్షరాలు చల్లటం
అవ్వాలి అందాలుచూపటం
ఆనందాలు కూర్చటం
అనుభూతులు పంచటం
పదాలు పేర్చటం
పలికించి శబ్దాలువినిపించటం
చెవులకు శ్రావ్యతకలిగించటం
సంతసాలు అందించటం
కలం చేబూనటం
భావాలు తెలపటం
అంతరంగాలు తట్టటం
శాశ్వతస్థానం సంపాదించటం
కాగితాలు నింపటం
అమరత్వం పొందటం
దూరాలు పయనించటం
చరిత్రలో సుస్థిరమవ్వటం
పుస్తకం ముద్రించటం
కవితల సంకలనం
భావితరాలకు అదృష్టం
సాహిత్యానికి సుసంపన్నం
సుకవులకు స్వాగతం
అభినందనం వందనం
కుకవులకు ప్రబోధం
మార్చుకొనుటకు విధానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి