శ్రీ శ్రీ: - డా సి వసుంధర,చెన్నై
శ్రీ శ్రీ మళ్లీ పుట్టలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు 
ఒకవేళ పుట్టి ఉంటే 
కరోనా కాలంలో కష్టాలకు కదిలిపోయే జనసంచారాన్ని 
చూచి ప్రభంజనంలా ఓ మహా ప్రళయంలా
 జగన్నాథం రథచక్రాలు కాక,
జగన్నాథుని చేతి చక్రంలా
విజృంభించేవాడు
పద పరాక్రమం చూపేవాడు. 
కానీ ఎక్కడ? ఎక్కడ?ఆవి లేవే ఎక్కడ!

అక్షరాల అగ్ని కణాలు 
గుక్క తిప్పుకోలేని పదజాల బాణసమూహాలు, 
వెన్నులో వేడి పుట్టించే వాక్యాల
వడగాలులు,  భూమిని బద్దలు చేసి 
భావాగ్నితో, 
ఏది కవిత!, ఎక్కడ కనిపించలేదే? 
అందుకే శ్రీశ్రీ మళ్లీ పుట్టలేదు. అటువంటి అక్షర శ్రీ
 ఈ అవనిపై ఇంకా కాలు పెట్టలేదు. పె డుతుందో లేదో కూడా తెలియదు

కామెంట్‌లు