ఆ కాలం హుష్ కాకి:- డా. సి వసుంధర చెన్నై
నేటి ఆడపిల్లలు పుట్టింటికి చుట్టాలా! 
తప్పు తప్పు. అత్తింటికి
అప్పుడప్పుడు వచ్చిపోయే  చుట్టాలంటే కరెక్టేమో 

పుట్టింట్లో బాడిగిల్లైనా బాధ లేదు. 
అత్తింటికి,తప్పు తప్పు  భర్తింటికి లేక తనింటికి రాగానే 
సొంత బంగాళా కావాలి బుజ్జమ్మకు. లేకపోతే చిరుబుర్రు. 
  
జానపద గీతాల అభ్యర్థనలు, అడగడాలు నేడు లేవు........
" మజ్జిగ చిలికేటి మా అత్తగారా! మా అన్నలు వచ్చారు నన్నంపుతారా."
లాంటి పాటలు నేడు నీటి మూటలే. 

 వచ్చిరాక ముందే వేరింటి, సొంతింటి కాపురం
పుట్టింటికి తన ఇంటికి
బేదమే లేని
జీవితం. పొద్దున్నే ఫోన్ పట్టుకుని అమ్మతో చాట్. రోజుకు నాలుగు సార్లఐనా ఫుల్ రిపోర్ట్. 
 
ఇంతైనా అంతైనా 
అమ్మకు ఆహ్వానం లేదా పుట్టింటికి తన ప్రయాణం.
మగపిల్లల్ని కన్న తల్లులు, తమ పిల్లలకోసం పడిగాపులు కాయాల్సిందే.
 నేటి ఆడపిల్లలకు భర్తలను తయారుచేసి యంత్రాగారాలు అత్తగారిల్లు. 

పుట్టింటికి చుట్టాలు కాదు ఆడపిల్లలు.
ఆ ఇంటి  నట్టింట్లో 
తిష్ట వేసుకున్న 
మహాలక్ష్ములు.
అత్తారింటికి చుట్టపు చూపుగా వచ్చే కొత్తవారు,ఈనాటి లేడీ పిల్లలు.

కామెంట్‌లు