యూఎస్ వాసుల చైతన్య దీపిక వాషింగ్టన్ మాన్యు మెంట్:- -ఎస్.వి.రమణా చార్య,జర్నలిస్ట్


 ఈ మాన్యుమెంట్ ఓ కట్టడమే కాదు.అమెరికా రాజకీయ సాంస్కృతిక చరిత్రలో ఓ సింబాలిక్ గా నిలిచింది.ఇది జార్జ్ వాషింగ్టన్ నాయకత్వాన్ని, ప్రజాస్వామ్య స్థాపనలో ఆయన పాత్రను శాశ్వతంగా గుర్తించేందుకు నిర్మిచిన ఓ అత్యుత్తమ జ్ఞాపక చిహ్నం.జార్జ్ వాషింగ్టన్ అమెరికా స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారు.అనంతరం అమెరికా తొలి అధ్యక్షుడిగా సేవలు అందించారు.నిజాయతీ,నిబద్ధత,ప్రజాస్వామ్య స్పూర్తితో పనిచేసి అమెరికా ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు జార్జ్ వాషింగ్టన్.
 1784లో అమెరికా విప్లవం తర్వాత ఈ రాతిస్థంబ నిర్మాణాన్ని తలపెట్టారు.ఆ తర్వాత అమెరికాలో జరిగిన సివిల్ వార్(పౌర యుద్ధం),నిధుల కొరత,రాజకీయ విభేదాల కారణంగా వాషింగ్టన్ మ్యాన్యూమెంట్ నిర్మాణం ఆలస్యమైంది.1877లో రాతి స్తంభ నిర్మాణాన్ని ప్రభుత్వం మళ్ళీ చేపట్టింది.1884లో నిర్మాణం పూర్తి అయింది.ఈ మాన్యు మెంటు ఎత్తు 555 అడుగులు(169 మీటర్లు) ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత నిర్మాణంగా కొనియాడబడింది.1885లో ప్రజల కోసం తెరిచినప్పటికీ, అధికారికంగా 1888లో ప్రారంభించారు.దీనిని ఓ బెలిస్క్ స్టయిల్ గా ఈజిప్టు నాగరికతను సూచించే విధంగా నిర్మించారు. బెలిస్క్ అంటే ఓ పెద్ద రాతి స్తంభం అని అర్ధం.దీనిని సూర్య దేవుడికి ప్రతీకగా భావిస్తారని చరిత్ర కారులు చెబుతుంటారు.
 అమెరికా ప్రజలు జార్జ్ వాషింగ్టన్ ను తమ ఆధ్యాత్మిక నాయకుడిగా,వెలుగును చూపించిన దేవుడిగా ప్రస్తుతిస్తారు.ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది పర్యాటకులు ఈ రాతి  స్థంభాన్ని సందర్శిస్తారు. ఈ మాన్యుమెంట్ అమెరికా దేశవాసుల దేశభక్తికి నిదర్శనం.అమెరికా చరిత్రను,ప్రజలహక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడి స్పూర్తిని భావితరాలకు అందించే  చరిత్రవారసత్వంగా  అమెరికా ప్రజలు భావిస్తారు.ఇది ఓ రాజకీయ సాంస్కృతిక చిహ్నం.ఇది అమెరికన్ ప్రజాస్వామ్య స్వాతంత్ర్య ఆత్మకు జాతీయ సంపదకు స్థూల రూపం.చరిత్రకు ప్రేరణగామార్చే శక్తిగా ఈ కట్టడం నిలిచిందనడంలో ఏలాంటి సందేహం లేదు.

కామెంట్‌లు