ఒకప్పుడు
ఇక్కడ బావి ఉండేది!
చెరువు ఉండేది!
నది ఉండేది!!
చేపలు ఉండేవీ!!
ఇప్పుడు -అక్కడ
బావి లేదు
చెరువు లేదు
నది లేదు!!
సముద్రం-బావిని చెరువును నదిని
మింగేసింది.
చేపలను మింగేసింది.!!?
ఒకప్పుడు ఇక్కడ
చెట్లుండేవీ
వనం ఉండేది
అడవి ఉండేది
ఇప్పుడు-చెట్లను వనాన్ని అడవిని
మహా పుణ్యం మింగేసింది!!
ఒకప్పుడు ఇక్కడ
గూడెం ఉండేది
పల్లె ఉండేది
పట్నం ఉండేది
జనం ఉండేది.
ఇప్పుడు- గూడెం పల్లె పట్నాన్ని జనాన్ని మహానగరం మింగేసింది.!!
ఇప్పుడు
సముద్రంలో-తిమింగలాలు ఉన్నాయి!
మహారణ్యంలో-పులులు సింహాలు ఉన్నాయి!!
మహానగరంలో-ధనవంతులు ఉన్నారు!!
ఏమీ మారలేదు
మారింది మహాసముద్రం
మారింది మహారణ్యం
మారింది మహానగరం
మారందీ పేదవాడు మాత్రమే!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి