భాగవతవిశేషాలు...:- అచ్యుతుని రాజ్యశ్రీ

 భాగవతంలో ఒక రాక్షసుని పేరు వృకాసురుడు. వీడు కేదార క్షేత్రంలో వారం రోజుకు తపస్సు చేసి శివానుగ్రహం కోసం ఎంతో తాపత్రయ పడ్డాడు శివుడు కనపడకపోవడంతో తన శరీరాన్ని ముక్కలుగా చేసి అగ్నిహోత్రంలో వేశాడు ఆ తర్వాత తలను నరుక్కోబోతుండగా శివుడు ప్రత్యక్షమైనాడు కోరిక ఏమంటే నేను ఎవరి తల పైన చేయి పెడితే వాడి తల వక్కలు మొక్కలై పోవాలి శివుడు తధాస్తు అన్నాడు వీడు వెంటనే శివుని తలపై తన చేయి పెట్టాలని ప్రయత్నిస్తాడు అప్పుడు శివుడు పారిపోతాడు విష్ణువు ఈ రాక్షసుడికి సలహా ఇస్తాడు నీవు శుభ్రంగా కాళ్లు చేతులు శరీరాన్ని నీటితో కడుక్కుని ఆచమనం చేసి అప్పుడు శివుని తలపై నీ చేయి పెట్టు ఆ సలహా ప్రకారం వృకాసురుడు ఆచమనం చేస్తూ తలపై తన చేతిని పెట్టగానే వాడితల వెయ్యి వ్రక్కలైంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అని ఈ ఉదంతం తెలుపుతోంది అలాగే ద్వారకలో ఒక బ్రాహ్మణుడికి ఎనిమిది మంది పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటారు అతను రాజద్వారం దగ్గర కూర్చుని ఉగ్రసేన రాజుని కృష్ణుడిని అందరినీ నిందిస్తూ కొడుకు శవాన్ని అక్కడ పెట్టుకుని ఏడుస్తాడు అప్పుడు అర్జునుడు అహంకారంతో నేను నీ నీ కొడుకు చనిపోకుండా నేను గట్టి బందోబస్తు చేస్తాను అని చెప్తాడు బ్రాహ్మణుడి భార్య ప్రసవించిన తర్వాత ఆ ప్రసూతి గృహం చుట్టూ తన బాణాలతోటి గట్టి రక్షణ ఏర్పాటు చేశాడు కానీ ఈసారి చచ్చిపోయిన శిశువు జన్మించి మాయమైన అప్పుడు ఆ బ్రాహ్మణుడు అర్జునుని నిందిస్తాడు నువ్వు నా కొడుకు శరీరాన్ని కూడా చూడనీకుండా మాయం అయ్యేట్లుగా చేశావు అంటాడు కృష్ణుడు అప్పుడు ద్వారకలోనే ఉన్నా కనీసం ఈ విషయాన్ని గూర్చి పట్టించుకోలేదు కానీ అర్జునుడి గర్వం అనిచేటందుకే ఆ బ్రాహ్మణుని కొడుకులు పుట్టగానే చనిపోయే మాయ చేశాడు అర్జునుడు చితిలో ప్రవేశిస్తుండగా కృష్ణుడు ఇలా అంటాడు నీవు ఆ పిల్లల్ని వెతుకు అని అర్జునుడితో రథంపై బయలుదేరాడు అక్కడ రథం సాగిపోతుండగా దట్టమైన చిమ్మ చీకటి అలముకుంది అర్జునుడు భయపడ్డాడు అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెడితే వెలుగు వచ్చింది ఆ తేజోమండలంలోకి అర్జునుడు వెళ్లి పాలసముద్రంలో పవళించిన నారాయణ చూస్తాడు మీ నర నారాయణలు నా అంశతో జన్మించారు కాబట్టి ఇక మీరు మీ జన్మ లను విడిచి పెట్టాలి అన్నాడు ఆ బ్రాహ్మణుడి పదిమంది పిల్లలు విష్ణు పాదాల దగ్గర వైకుంఠంలో ఆయన్ని స్తోత్రం చేస్తూ భక్తీగా తృప్తిగా ఉన్నారు మొదట యముడి దగ్గరికి యోగశక్తితో వెళ్లిన అర్జునుడికి శ్రుంగభంగం అయింది ఆ బ్రాహ్మణ శిశువులను నేను చంపలేదు అన్న యముని మాటలతో బుద్ధి వచ్చింది అలా బుద్ధి చెప్పి కృష్ణుడు 125 ఏళ్లు బ్రతికి దేహత్యాగం చేయాలని అవతార సమాప్తి కావించాడు పాండవులు తమ రాజపోగాలు వీడి స్వర్గారోహణ చేశారు కృష్ణ నిర్యాణం గురించి విన్నవాడు పరమ భక్తుడైన ఉద్దవుడు కృష్ణుడు ఆయనతో ఏడవ రాత్రి ద్వారక సముద్రంలో మునుగుతుంది కలియుగం ప్రవేశిస్తుంది కోపం తాపంతో రోగాలు వైశ్యామ్యాలు శత్రుత్వం పెరిగి ప్రజలు ఆటవికులుగా మారిపోతారు అని కలియుగ లక్షణాన్ని చెప్తాడు ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే కేవలం పదిమంది గోప బాలకుల చేతిలో అర్జునుడు ఓడిపోయాడు ఇప్పుడు అతనికి తెలిసి వచ్చింది కృష్ణుడి అండదండలు లేకుంటే తను ఎందుకు పనికిరాని వాడనని తన భుజబలం గాండీవం అన్ని పనికిరాకుండా పోతాయని గ్రహించాడు గర్వాన్ని వదిలిపెట్టాడు బలరాముడు ముందే శరీరాన్ని విడిచి వైకుంఠం చేరాడు ఆ తర్వాత కృష్ణ నిర్యాణం జరిగింది కృష్ణుడు యాదవ కుల నాశనం అయి తీరుతుంది అని ముందే గ్రహించాడు అలాగే యాదవులంతా సాంబుడు అనే వాడికి ఆడవేషం వేసి గొప్పవారైన మునుల దగ్గరకు వచ్చి ఈమెకు గర్భంలో ఉన్న శిశువు ఆడదామగదా అని అడుగుతారు వాళ్లు కోపించి ముసలం పుడుతుంది అని శపిస్తారు ముసలం అంటే ఇనప రోకలి సాంబుడి చీరలోంచి ఇనుప రోకలి పడుతుంది. దాన్ని వారు కృష్ణుడి పాదాల దగ్గర పెడతారు ఆయన వారితో అంటాడు ఈ ముసలం మీ చావుకి కారణం దీన్ని ఇనుప శిఖరం దగ్గరికి తీసుకెళ్లి బాగా అరగదీయండి అని యాదవులు దాన్ని బాగా అరగదీసి చిన్న ముళ్ళు సైజులో నీటిలో పడేస్తారు దాన్ని ఒక చేప మింగుతుంది వేటగాడు ఆ చేపని తీసి దాని పొట్టలోని ముల్లుని తన బాణానికి తగిలిస్తాడు ఈ ఈ బాణం తగిలి కృష్ణుడు దేహం చాలిస్తాడు ఒంటరిగా.ఇలా కృష్ణావతారం సమాప్తమైంది. ఆఖరు ఉపదేశం విన్న ఉద్ధవుడు గొప్ప భాగ్యశాలి.అంతా మన ప్రజ్ఞ అనే అహం వదిలి పరమాత్మ అనుగ్రహం అని భావిస్తు దైవ స్మరణ లో సదా మనం జీవితం గడపాలి🌷
కామెంట్‌లు