ఎర్ర సూర్యులు, :- నారి నరేష్ మస్కట్ ఒమన్,
సాహితీ కళాపీఠం,
సాహితీ కెరటాలు,
===============
బానిస బతుకుల జీవితానికి 
ఎదురోడి నిలబడి కలబడతారు,
ఎగసే కెరటమై ముందుకు దూకుతారు -
వారి బాట ముళ్లబాటైన ముందుకు కదులుతారు!

కష్టంలో ఉంటే సహాయ సహకారాలు అందిస్తారు,
మీకు ధైర్యమై సాగిపోతారు!
వారి పోరాటం తప్పు చేసిన వారి మీద -
సామాన్య ప్రజల్ని కాపాడుకోవడమే వారి ధ్యేయం, 

నింగిలో నెలవంకలు వారు, 
ఉదయించే సూర్యులు,
ఉద్యమమే ఊపిరి గా జీవిస్తారు -
సామాన్య ప్రజల్ని  - కంటికి రెప్పలుగా కాచుకుంటారు!

దోపిడీ వ్యవస్థను పారద్రోలుతారు,
పేదోళ్ల గెలుపే - వారి గెలుపు,
 మేమున్నామంటూ భరోసా కల్పిస్తారు -
వారిమాటే  ఆయుధం కదులుతోంది,
ఎర్ర జడా కింద సేద తీరే వీరులు వారు.!


కామెంట్‌లు