శ్రుతి 7వ తరగతి చదువుతున్నది. తల్లిదండ్రులు లేరు. ఆ ఇంట్లో శ్రుతి వాళ్ళ నాయనమ్మ ఇద్దరే ఉంటారు. ఆ నాయనమ్మ ఇంటిపని, వంటపని మొత్తం శ్రుతితోనే చేయిస్తుంది. తాను మాత్రం అదేపనిగా టీవీ చూడటం మరియు చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళి వారితో బాతాకానీ పెడుతంది. పనిభారం వల్ల తరచూ పాఠశాలకు ఆలస్యంగా వస్తుంది.
శ్రుతి నాయనమ్మ పంజరంలో రామచిలుకను పెంచుతుంది. శ్రుతి తన కష్టాలను బయటి వాళ్లకు చెప్పడం ఇష్టం లేక రోజూ రామచిలుకకు తన కష్టాలను చెప్పుకునేది. రాను రాను శ్రుతి నాయనమ్మ గయ్యాళితనం శ్రుతి మించుతుంది. శ్రుతి బయట చెట్టుకింద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది శ్రుతి స్నేహితురాలు లయ చూసింది. శ్రుతి కష్టాలను లయ తన ఇంట్లో వారికి చెప్పుకుంటుంది. లయ తల్లిదండ్రులు శ్రుతిని తమ ఇంటికి తీసుకు రమ్మని ఇక నుంచి శ్రుతి ఆలనా పాలన పూర్తిగా మనమే చూసుకుందాం అన్నారు.
లయ శ్రుతి వాళ్ల ఇంటికి వెళ్ళి "ఇక నుంచి మనం ఇద్దరం కవల పిల్లలం అనుకుందాం. మా అమ్మా నాన్నలు శాశ్వతంగా నిన్ను మా ఇంటికి తీసుకు రమ్మన్నారు." అన్నది. శ్రుతికి ఇష్టం లేకపోయినా బంగారు భవిష్యత్ కోసం ఒప్పుకుంది. నాయనమ్మకు చెప్పకుండా అన్నీ సర్దుకొని బయలుదేరింది. పోతూ పోతూ పంజరం తలుపు తెరచి రామచిలుకను విడిచి పెట్టింది. శాశ్వతంగా విముక్తిని కలిగించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి