ఆకలి...రోకలి పోటైవెన్నుపోటుపొడుస్తుంటే..?వేటగాడిలామారాలి...వేటాడాలి...జింకల్నికాదు...గాండ్రించే పులుల్ని ...పంజావిసిరే సింహాలను...ఘీంకరించే మదపుటేనుగుల్ని...పిడికిలిబిగించినా...ప్రశ్నించినా...ప్రతిఘటించినా...ప్రాణాలకు తెగించి పోరాడినా...ప్రతిఫలం దక్కకపోతే..?ఆకలిగొన్న పులిలా మారాలి...అక్రమార్కుల్ని అంతంచెయ్యాలినిన్ను...పక్షిలా స్వేచ్ఛగా...ఎగర నివ్వని...నిన్ను...మొక్కలా పచ్చగా...ఎదగ నియ్యని...కుట్రలు కుతంత్రాలు పన్నుతూకులమతాల కుంపట్లను రాజేసేమనువాద...మతోన్మాద...రక్కసిమూకల రక్తాన్ని రుచిచూడాలి...గొంతులో నరాలు తెగేదాక...అరిచినా అల్లరి చేసినా...బకాసురులుకుంభకర్ణులు ఇంకానిద్రలేవకపోతే..?మనుషులుగా మారకపోతే...గన్నైనా భుజాన వ్రేలాడాలి...గండ్ర గొడ్డలైనా పైకి లేవాలి...కొన్ని తలలైనా తెగి పడాలి...గాలిపటాలై గాలిలోఎగరాలి...చల్లని చంద్రులనుఎర్రని సూర్యులుగా మార్చాలి...వెలివాడల్లో వెలుగుల్ని విరజిమ్మాలి...(కీ.శే అలిశెట్టి ప్రభాకర్‌గారికి అంకితం ఈ మీనీ కవిత)...
ఎగరలేని పక్షి...ఎదగలేని మొక్క...(మినీ కవిత)...:-కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కవి కూకట్లపల్లి -అత్తాపూర్....హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి