,"చీకటి- వెలుగుల జీవితం.":- బెహరా నాగభూషణరావు .
సాహితీ కెరటాలు .
సాహితీ కవి కళా పీఠం .
=================
మామను చూపి, బుజ్జగింపులతో
అమ్మ పెట్టే  అమృతం..!
తాత చెప్పే కథలతో,
 "శశిని" అందుకోవాలనుండేది
పసిప్రాయంలో..!
ఈనాడు- జీవితమే చందమామ నాకు!

చంద్రునిది - కక్ష్యా  కమనం,
నాది -జీవన పయనం .

శశాంకుని గమనముతో- 
తిధి, వారాల చక్కబాటు.

నా కర్తవ్య దీక్షతో -
గృహ స్వర్గసీమకు తోడ్పాటు.

కృష్ణ పక్షంలో పెరిగే నేలపంకంలా,
కష్ట-నష్టాలు,నాలో తిమిరాన్ని  పెంచి, 
బాధను రగిల్చి ,కాల గమనములో
 "అనుభవాల పాఠాలు" నేర్పి ,
ఆనందపు ఫలాలనిచ్చి ,
వసంతకాల చిగురులా,

శుక్లపక్ష చంద్రికలో..
వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలా,
వెన్నపరిచిన నేలలా,  
ప్రేమికులు  మైమరచిన వేళలా ,
అల్లంత ఎత్తున  ఎగిసి పడే 
సాగర కెరటాల్లా ,
ఇలా సాగనీ....
అనే వాంఛతో..!

నాలో ఆనందాలు మొగ్గతొడిగాయి;
జీవితమే  చందమామ అవునని..!


కామెంట్‌లు