స్ఫూర్తిదాతలు సేకరణ......అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రతి ప్రాణికీ తిండి నీరు ముఖ్యం.కానీ పర్యావరణ కాలుష్యం మనిషి తప్పిదాలవల్ల అతివృష్టి అనావృష్టి.కానీ రాజస్థాన్ కి చెందిన నారాయణ్, అంకిత్, పూరన్ అనేయువకులు*హైడ్రోజెల్ఫసల్ అమృత్* అనే పొడిని తయారుచేశారు.మనం శరీరానికి నూనె మాయిశ్చరైజర్ పట్టిస్తాం చర్మం నిగనిగ లాడాలని. అలాగే వీరు తయారుచేసిన ఫసల్ అమృత్ మట్టికి తేమను కలుగచేస్తుంది.ఈపొడిని చెరకుపిప్పి,అరటి కమలాఫలం ఇతర పళ్లతొక్కలతో తయారుచేస్తారు.ఉదయపూర్ లో ఉంది ఈసంస్థ.ఈపొడిని పొలంలో నీటితో పాటు వాడితే  పైరు తక్కువ నీటితో మంచి ఫలసాయం అందిస్తుంది.  రైతులు  వాడి భూసారం పెంచుకున్నారు.రసాయన ఎరువుల వాడకం లేక పోవటంతో భూమి సారవంతంగా ఉంటుంది.నీటి ఖర్చు తక్కువ. మనం కూడా మనం తిన్న పండ్లతొక్కలని ఇంట్లో మొక్కలకి వేస్తే చిన్న తోట తయారుచేసిన వారం అవుతాం.బియ్యం కడిగిన నీరు కరేపాకు మొక్కకి పోయాలి.వంటిఇంటి కూరగాయల తుక్కుని చెట్ల మొదళ్లలో వేస్తే చాలు.కనకాంబరం,కాకరపాదు త్వరగా పెరిగి పూలు కాయలు ఇస్తాయి🌹
కామెంట్‌లు