ఆరోగ్య ప్రదాత..! ప్రధాని మోడీ..!:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
5,000 ఏళ్ళనాడే
శారీరక...మానసిక  
ఆధ్యాత్మిక స్థితి కోసం...
మనస్సు...శరీరం...ఆత్మను 
పరివర్తన చేయడం కోసం... 
అరణ్యాలలో మునులు 
చేసేవారు...తపస్సు  
ఋషులు...మహర్షులు వేసేవారు...
ఆసనాలు  
క్రమ శిక్షణతో చేసేవారు...
వ్యాయామం...ధ్యానం...యోగా   

మనస్సు శరీరం యొక్క ఐక్యతకు
ఆలోచన ప్రతిచర్యకు మధ్య నిగ్రహానికి 
మనిషికి ప్రకృతికి మధ్య సామరస్యానికి
ఆరోగ్యం శ్రేయస్సుకు ఒక వారథి...యోగా 

వ్యాధులతో పోరాడి...
రోగరహితమైన శరీరాన్ని...
సంతోషకరమైన మనస్సును...
ఆరోగ్యకరమైన ఆత్మనందించేది...యోగా 

మన ప్రధాని మోడీ 
ప్రవేశపెట్టిన తీర్మానం 
175 మంది దేశాధినేతల 
మద్దతుతో ఆమోదం పొంది 
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ 
జనరల్ బాన్ కీ - మూన్  
కాలచక్రంలో అత్యంత 
పొడవైన రోజైన "జూన్ 21 వ తేదీని"
"అంతర్జాతీయ యోగా దినోత్సవంగా" ప్రకటించడం చారిత్రాత్మకం...
అది భారత్ కెంతో గర్వకారణం... 

ఒత్తిడి కారణంగా 
వ్యాధినిరోధక శక్తిలేక... 
జీవనశైలి మారక... 
ప్రపంచమంతా 
వ్యాధిగ్రస్తమై పోయిన వేళ
శరీరాన్ని ఇంద్రియాలను
క్రమశిక్షణతో 
నిరంతర సాధనతో  
నియంత్రించడంతో
మానవ మనుగడకు...  
శారీరక చైతన్యానికి...
ఆత్మ వికాసానికి... 
ప్రపంచ శాంతికి...
సకల జనుల శ్రేయస్సుకు...
"ఒక ఆక్సిజన్ గా"... 
"ఒక ఆయుధం గా" 
"ఒక ఔషధం గా"...
ప్రపంచ వ్యాప్తంగా"యోగాను" 
ఒక "ఆరోగ్యమంత్రంగా" 
విశ్వానికి అందించిన ఘనత
"ఆరోగ్య ప్రదాత" మన ప్రధాని మోడీదే...
జయహో మోడీ...జై హింద్...జై భారత్..! 



కామెంట్‌లు