ఓ అన్నలారా..! ఓ అక్కలారా..!ఓ చెల్లెల్లారా..! ఓ తమ్ముల్లారా..!ఓ అంబేద్కర్ వారసుల్లారా..!పూరిగుడిసెలో పుట్టిన ఓ పులుల్లారా..!సునామి ముంచుకొస్తున్నా...పిడుగులు నెత్తిన పడుతున్నా...ఎంతకాలంరా..? ఈ మొద్దు నిద్దుర....వద్దురా వద్దురా ఈ మొద్దు నిద్దుర...ఇకనైనా బద్దకం వీడరేమిరా...?కళ్ళుతెరిచి ఈలోకాన్ని చూడరేమిరా..?రేపటి మీ పిల్లల బంగారుభవిష్యత్తును...ధ్వంసం చేసేందుకుఎన్ని గుంటకాడి నక్కలు...ఎన్ని మేక వన్యపులులు...ఎదురు చూస్తున్నాయో...ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరేమిరా..?మీరంతా చలిచీమల్లాఏకమై ఐక్యమై...చిరుత పులులైఒంట్లో ఓపికున్నంత వరకు కాదుకాదు బొందిలో...ప్రాణమున్నంత వరకు...పోరాడాలిరా..! పోరాడాలిరా..!మీ కోసమే కాదు...రేపటిమీపిల్లల సురక్షితమైనసుఖజీవనం కోసమైనా...అంబేద్కర్ ఆశయాల సాధనకోసమైనా..ఇప్పుడు ప్రశ్నించకపోతే...ఇంకెప్పుడు..?ఇప్పుడు గొంతెత్తి మీ నిరసనను వినిపించకపోతే...ఇంకెప్పుడు..?ఇప్పుడు ప్రతిఘటించకపోతే ఇంకెప్పుడు?ఇప్పుడు పోరాడకపోతే...ఇంకెప్పుడు..?ఇప్పుడు శతృమూకల్ని ఎదిరించకపోతే.?ఇప్పుడు వారి గుండెల్లో నిదురించకపోతే?గుండెల్లో గునపాలు దించకపోతే..?వారికిగుణపాఠాలు నేర్పించకపోతే ఇంకెప్పుడు?ఎదిరించండి..? బెదిరించండి..?అంబేద్కర్ అందించిన ఓటునేవజ్రాయుధంగా ధరించండి...రక్తపాతమో..?రాజ్యాధికారమో..?తక్షణమే తేల్చుకోండి..?పోరాడితే పోయేదేముంది చెప్పండి..?మీ సంకెళ్ళు...తెగిపోవడం తప్ప..!మీ సమస్యలు...పరిష్కారమవడం తప్ప.!తరతరాల బానిసత్వం నుండిమీకు విముక్తి..విశ్రాంతి లభించడం తప్ప.!
రక్తపాతమా? రాజ్యాధికారమా?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి