తూరుపు వాకిలికి వేలాడే
కొత్త వెలుగుల తోరణం
పసిడి కాంతులు ఒలికిస్తూ
పలకరింపుల పరవశం
పచ్చని పట్టుచీర కట్టుకుని
ముచ్చటగా ముస్తాబై
మురిసిపోతూ ముగ్ధలా
నవ వధువుగా తోచె వసుధ
సాగే ఏటికి జిలుగుల కానుక
పాడే అలలకు చిన్ని ప్రశంస
ఆడే చేపలకు ఉత్సాహమిస్తూ
తోడైన ఇరుగట్లకు జోడైన నేస్తం
కన్నులు నిండే సొయగాలు
మిన్నుల మారే నవ వర్ణాలు
తెన్నును మరపించి నిలిపి
అన్నీ మనవనిపించే అవని అందాలు
రంగుల మనసులు తెలిసిన
నిజమైన చిత్రకారుని కుంచె చేత
అలవోకగా ఆవిష్కరింపబడ్డ
అందమైన భువన సౌందర్యం
అంబరాన కాంతులీను
అధిక చక్కని అద్భుతమైన
అరుణోదయ తరుణాన
అంతరంగము పొందు ఆహ్లాదానికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి