హోడ(ప్ర)-ఓడ(వి):-కిలపర్తి దాలినాయుడు

 నేడు ప్రపంచ సముద్ర దినోత్సవం-08.జూన్

----------------------------------------
సీ.
సూర్యరశ్మినిబీల్చి సురటీలు విసరుచు 
చల్లబరచనెంచు సాగరమ్ము!
బొగ్గుపులుసుముక్కు పగ్గాలుచేపట్టి 
సవరించుగట్టిగా సాగరమ్ము!
మీనరాశులకెల్ల మేనులు దువ్వుచు
సౌఖ్యమ్ము నిచ్చును సాగరమ్ము!
రత్నాలు గర్భాన ప్రసవించు తల్లిగా
సంసారమును బెంచు సాగరమ్ము!
తే.గీ.
చినుకు పూలను కురిపించు మనికి పెంచు 
శీతలోష్ణపవనముల్ చిందులాడ 
వేగు వ్యాపార 'హోడల' సాగనంపి
భూమి వేడిని తగ్గించ బూనునెపుడు!
---------------------------------------
కామెంట్‌లు