ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ఉపాధ్యాయుడు అటువైపు తిరగగానే వైదేహి, విజయ, శ్రావ్య, సుమ అనే అమ్మాయిలు ముచ్చట్లు, ఒకరిపై ఒకరు జోకులు నవ్వులు. ఉపాధ్యాయుడు విద్యార్థులను పుస్తకాలు తీసి, చదువుకోమన్నా సరే ఉపాధ్యాయుల కళ్ళు గప్పి ఈ నలుగురు అమ్మాయిలు ముచ్చట్లు. వీళ్ళ తీరు ఉపాధ్యాయుని దృష్టికి వచ్చి, ఉపాధ్యాయుడు వాసు ఎన్నోసార్లు చివాట్లు పెట్టాడు. ఎన్నోసార్లు హెచ్చరించాడు కూడా. "పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. చదువుకోమన్నప్పుడు ఏకాగ్రతతో చదువుకోవాలి. ఉపాధ్యాయులు చెప్పిన పాఠం శ్రద్ధగా వింటే, ఏరోజు పాఠం ఆరోజు చదివితే మీకు తిరుగు ఉండదు. ఎప్పుడూ బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారు." అని. ఈ హితబోధ చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉంది. వారిలో మార్పు రాలేదు.
మరోసారి వాసు మాస్టర్ ఇలా అన్నారు. "మీకు ఎంజాయ్ చేయాలి అనిపిస్తే తీరిక సమయంలో ఎంజాయ్ చెయ్యండి. లంచ్ సమయంలో కలిసి తింటూ జోకులు వేసుకోండి. రోజూ సాయంత్రం ఒక గంటసేపు ఆడుకోండి. అవి మీకు తీపి గుర్తులు అవుతాయి. కానీ పాఠం వినాల్సిన సమయంలో, చదవుకోవాల్సిన విలువైన సమయంలో ఇలా చేస్తే మీకే తీవ్ర నష్టం." అన్నాడు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు అయింది.
మళ్ళీ ఈ నలుగురు ముచ్చట్లు. "మీరు నలుగురూ ఒకరికి ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. మీరు మిత్రులు కారు. ఒకరికొకరు శత్రువులు. మీ భవిష్యతును మీరే దెబ్బ తీసుకుంటున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా చెప్పినట్లు వింటే బాగుపడతారు. లేకపోతే మీ ఖర్మ!" అని హెచ్చరించాడు. ఉపాధ్యాయుడు ఈ నలుగురినీ పట్టించుకోవడం మానేశాడు. వారితో మాటలే మానేశాడు.
క్రమంగా విజయ సీరియస్ గా పాఠం వింటూ, శ్రద్ధగా చదువుకోవడం మొదలు పెట్టింది. మిగతా వారు డిస్టబ్ చేస్తున్నా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటుంది. మిగిలిన ముగ్గురినీ వదిలేసి, మరోచోట కూర్చుంటుంది. వైదేహి విజయ దూరం అయినందుకు బాధపడింది. మిత్రురాలిలో వచ్చిన మార్పును అర్థం చేసుకుంది. తానూ విజయతో కలసి పాఠాలు శ్రద్ధగా వినడం, తీరిక సమయాలలో చదువుకోవడం మొదలు పెట్టింది. వైదేహి మార్కులు కూడా పెరుగుతున్నాయి. ఉపాధ్యాయుడు వారిలో వచ్చిన మార్పుకు సంతోషించి మంచి బహుమతులు ఇచ్చాడు.
10వ తరగతి ప్రీ ఫైనల్స్ జరిగాయి. సుమకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. తల్లిదండ్రులు బాగా తిట్టారు. సుమ చాలా దిగులుతో ఉంది. ఇన్నాళ్ళూ ఉపాధ్యాయులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టాను. తనకు తెలివి ఉన్నా చెడు సహవాసంతో విలువైన సమయం అంతా వృథా చేసుకుంది. శ్రావ్య మిత్రురాలు కాదు. తనకు పెద్ద శత్రువు. ఇన్నాళ్ళూ తమ ముగ్గురి ఏకాగ్రతను చెడగొట్టింది శ్రావ్యే. మిగిలిన ఇద్దరూ శ్రావ్యను పక్కన పెట్టి బాగుపడ్డారు. తాను తన భవిష్యత్తును అంధకారం చేసుకోబోతున్నానా? అనే దిగులులో పడింది. పబ్లిక్ పరీక్షలకు సమయం ఎక్కువ లేదు. చదవాల్సింది కొండంత.
పబ్లిక్ పరీక్షలలో శ్రావ్య, సుమ ఇద్దరూ ఫెయిలయ్యారు. విలువైన సమయాన్ని ఎంజాయ్ చేసినారు. తమ వినోదాలకు ఫుల్ స్టాప్ పడింది.
సమయం విలువ : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి