ఏ నిమిషానికి ఏమి జరుగునో:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
అనుకున్నది సాధించానని
అరేళ్ళయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తు
అందరు కలిసి ఉండవచ్చునని భార్య
వైద్యవృత్తి కి రాజీనామచేసి
ముగ్గురు పిల్లలతో కలసి
భవిష్యత్ బంగారుమయమనుకుని
లండన్ లో సుఖమయ జీవితం గడపవచ్చునని
అందరి దీవెనలు తీసుకుని
అహమ్మదాబాద్ లో విమానం ఎక్కి
సంతోషంగా  భార్యా పిల్లలతో సెల్ఫీ తీసుకుని
కుటుంబ సభ్యులకు పంపిన
అతనికి ఏమి తెలుసు
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందన్నది
తాను తీసిన సెల్ఫీయే 'చివరి సెల్ఫీ' అని
తామంతా అందనిలోకాలకు వెళుతున్నామని
కన్నవారి కడుపుకోతకు కారణమవుతామని
"జాతస్యహి ధృవో మృత్యు: "అన్నది నిజమే
భవిష్యత్ ఎంతో ఉండాల్సిన జీవితాలు
అర్ధాంతరంగా  విమాన ప్రమాదంలో ముగిసి పోవడం చూసి  ఆర్ద్రతతో
నాలో నేననుకున్నా
ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నది....!!


(అహమ్మదాబాద్ లో లండన్ వెళ్ళే బోయింగ్ విమానంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన చూసి ఆర్ద్రతతో వ్రాసినది)
...........................

కామెంట్‌లు