“ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. కానీ వృద్ధులు కావడాన్ని కోరుకోరు.”
– జోనాథన్ స్విఫ్ట్
ఒకప్పుడు, ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని కంటి చూపు మందగించింది. చేతులు వణుకుతున్నాయి. వినికిడి సమస్య తలెత్తింది. అతను కనీసం చెంచా కూడా పట్టుకోలేకపోయాడు. భోజన సమయంలో కచ్చితంగా ఏదో ఒకటి కింద వొలకబోసేవాడు. దీంతో
విసుగు చెందిన అతని కొడుకు, కోడలు భోజనాల సమయంలో ఆయనను ఒక మూలకు తరలించి, పాత గిన్నెలో వేరేగా ఆహారం వడ్డించే వారు.
అయితే ఆయన ఆ ఒంటరి ప్రదేశం నుంచి డైనింగ్ టేబుల్ వైపు విచారంగా చూస్తుండేవారు. అతని కళ్ళు మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేవి.
ఒక రోజు, ఆయన వణుకుతున్న చేతుల నుంచి ఓ గాజుపాత్ర జారి కిందపడి పగిలిపోయింది.
భార్య, పిల్లలూ ఆయనను మండిపడ్డారు. నానా మాటలన్నారు. కానీ ఆయన ఏమీ అనలేదు. నిట్టూర్చారు. లోలోపల బాధపడ్డారు.
ఆరోజు నుంచి వారు ఆయనకు ఓ చెక్క గిన్నెలో ఆహారం వడ్డించారు.
తరువాత, ఒక మధ్యాహ్నం, ఆయన కొడుకు, కోడలు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు, వారి ఆరేళ్ళ అమ్మాయి ఒక చిన్న చెక్క ముక్కను పట్టుకుని లోపలికి వచ్చింది.
"ఏమిటిది...?" అని ఆ అమ్మాయి తండ్రి అడిగాడు.
"ఇదా, ఓ చెక్క గిన్నె" అని చెప్పిందా చిన్నమ్మాయి.
“నేను పెద్దయ్యాక నువ్వూ, అమ్మ తినడానికే ఈ చెక్క గిన్నె" అని జవాబిచ్చింది ఆ పిల్ల.
ఆ మాటతో అంతా నిశ్శబ్దం.
ఫ్రెంచ్ రచయిత జోసెఫ్ జౌబర్ట్ చెప్పినట్లుగా "పిల్లలకు విమర్శకుల కంటే మోడల్స్ అవసరం.”
అందుకే మనం గుర్తుంచుకోవాలి :
ఈ రోజు మన చర్యలు మన పిల్లలు ముందుకు తీసుకెళ్లే పాఠాలు. ముఖ్యంగా మన చేతులు చిన్నగా ఉన్నప్పుడు ఒకప్పుడు మనల్ని పట్టుకున్న వారి పట్ల దయ, సానుభూతి ఉండాలి. పెద్దల్ని గౌరవించాలి. మర్యాద చూపడం కనీస బాధ్యత.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి