రంగాపురం రాజ్యాన్ని విజయేంద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తీరిక సమయాలలో వేటకు వెళ్ళడం అతనికి అలవాటు. వేటకు వెళ్ళి ఇష్టమైన జీవులను వేటాడి తెచ్చి, వండించుకుని తినేవాడు.
మహారాజు ఒకరోజు వేటకై బయలుదేరినాడు. మధ్యలో అతడు వేట ఆలోచన విరమించుకుని వెనక్కి వచ్చాడు. తన కుమార్తె వద్దకు వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సమయంలో తన కుమార్తె శ్రీవాణీ తన స్నేహితురాలు శ్రావణితో ఆడుకుంటుంది. "నాన్నగారూ వేటకు వెళ్ళలేదా?" అన్నది శ్రీవాణి. "లేదమ్మా! నీ పుట్టిన రోజు అని గుర్తుకు వచ్చి, నీకోసం వెనక్కి వచ్చా." అన్నాడు విజయేంద్రుడు.
అప్పుడు శ్రీవాణీ మిత్రురాలు శ్రావణి ఇలా అన్నది. "నీ పుట్టిన రోజు పుణ్యమా అని అడవిలో ఏదో జీవి బతికిపోయింది. ఈ భూమి మీద కొన్నాళ్ళు ఆ జీవులకు ఆయుష్షు ఉంది." అని. ఆ మాటకు తన తండ్రికి కోపం వస్తుంది అని కంగారు పడింది శ్రీవాణి. కానీ విజయేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. తనకు రకరకాల రుచుల కోసం ఇతర జీవుల బ్రతికే హక్కును పాడు చేస్తున్నా. అవును. తన ప్రజలను కాపాడుకున్నట్లే ఆ అడవి జీవులను కాపాడుకోవాలి అనుకున్నాడు మహారాజు. శ్రావణిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. కానుకలను ఇచ్చాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి