సంతుష్టతే సగం బలం:-:సి.హెచ్.ప్రతాప్
 మనిషి జీవితంలో శాంతి, ఆనందం, ఆరోగ్యం – ఇవన్నీ ఆశించే ముఖ్యమైన లక్ష్యాలు. అయితే ఇవన్నీ దక్కే మార్గం ఎక్కడిది? చాలామంది దాన్ని ధనం, విజయాలు, పదవులు, భవనాల్లో వెతుకుతుంటారు. కానీ నిజంగా వీటిలో శాశ్వత తృప్తి లభించదని జీవితం చెప్పిన పాఠమే – “సంతుష్టతే సగం బలం.”
సంతుష్టత అంటే ఏమిటి? అది మనం సాధించినవాటితో తృప్తిగా ఉండటం కాదు. ఉన్నదానిలో ఆనందాన్ని కనుగొనగలగడం. నిత్యం మారే ఈ లోకంలో మనసు స్థిరంగా ఉండే విధంగా మన మనోభావాలను మలచుకోవడమే నిజమైన సంతుష్టత.
పరుల విజయాల్ని చూసి అసూయపడటం, ఇంకా ఎక్కువ కావాలని ఆరాటపడటం మన శక్తిని దెబ్బతీస్తాయి. మనశ్శాంతిని క్షీణింపజేస్తాయి. కానీ ఉన్నదానికే ధన్యవాదం చెప్పడం అలవాటు చేసుకున్నవాడు – అతడే నిజంగా ధనికుడు.
సంతుష్టత మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అలాంటి మనిషి ఒత్తిడికి లోనవ్వడు. ఎదుటివారితో ప్రేమగా, సహానుభూతితో మెలుగుతాడు. కుటుంబ జీవితం ఆనందంగా, సామాజిక జీవితం గౌరవప్రదంగా ఉంటుంది.
ఒక రైతు పంట ఎలా పండిందో తెలియకపోయినా, భూమి మీద నమ్మకం ఉంచి తలపోస్తాడు. అతని హృదయంలో ఉండే సంతుష్టతే అతనికి సగం బలంగా నిలుస్తుంది. అలాగే విద్యార్థి, ఉద్యోగి, వ్యాపారి – ఎవరికైనా ఈ మనోభావం అవసరం.
సంతుష్టత ఉన్న చోటే శాంతి, ప్రేమ, ఆరోగ్యం ఉంటాయి. అది బాహ్య ప్రపంచం ఇచ్చేది కాదు; మన అంతరాత్మ నుంచి వెలువడేది. ఇవాళ మనం ఉన్న స్థితిలో సంతోషంగా ఉండగలిగితే – మనకు బలమే కాదు, ఆశీస్సుగా మారుతుంది.
కాబట్టి, ఎదుగుదల కోసం శ్రమించండి కానీ అసంతృప్తితో బతకకండి. ఎందుకంటే – సంతుష్టతే మన బలానికి ములమైంది. అది మన జీవితం నడిచే మార్గాన్ని ఉజ్జ్వలంగా చేస్తుంది.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం