పాలఖండ్యాంలో ఘనంగా యోగా ర్యాలీ, మానవహారం


 ధ్యానం వలన భయం, ఒత్తిడి, కోపం, ఆందోళనలు, తొలగిపోతాయని, నిగ్రహ శక్తి అలవడుతుందని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ ఏకాగ్రత, ఆలోచనలో స్పష్టత, జ్ఞాపకశక్తి, సంకల్ప శక్తి పెరిగేందుకు ఈ ధ్యానం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. తొలుత పాఠశాలలో ఉపాధ్యాయని ముల్లు సుజాత ఓం సంగచ్ఛద్వం సంపదద్వం సంవో మ నాంసి జానతాం దేవా భాగం యదాపూర్వే సంజనానా ఉపాసతే అంటూ విద్యార్థులందరిచే యోగా ప్రార్ధన గావించారు. అనంతరం సుజాత మాట్లాడుతూ ఐక్యంగా కదలుదాం, ఐకభావం పలుకుదాం, తొలి ఉన్నట్లు మన మనసులను సమచిత్తం చేద్దాం దైవాన్ని ఉపాసన చేద్దాం అంటూ ఆ ప్రార్ధన భావాలను వివరించారు. అనంతరం ఉపాధ్యాయని ముల్లు సుజాత ధ్యానముద్ర, వృక్షాసనం, కపాలభాతి, ప్రాణాయామం మున్నగు ఆసనాలు గావించారు. ఉపాధ్యాయులు వెలగాడ రాము వక్రాసనం, భుజంగాసనం మున్నగు ఆసనాలు గావించారు. ఉపాధ్యాయులు యందువ వెంకటరమణ ఆసనాల ఉపయోగాలు తెలిపారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ నిర్దేశాల మేరకు నేటి ఉదయం ఆరు గంటలకే పాఠశాలలో విద్యార్థులచేత ఈ యోగాసనాలు ప్రక్రియ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ దారబోయిన రెయ్యమ్మ, మాజీ సర్పంచ్ పలిశెట్టి సూర్యనారాయణ, యువజన సంఘ ప్రతినిధి డి.ధర్మరాజులు పాల్గొని యోగా అనేది మన ఇంటి నుండే ఆరంభమై మన జీవన విధానంలో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో ఉపాధ్యాయని యు.ఆదిలక్ష్మి యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం, పచ్చదనం ప్రకృతి ధనం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మన ఊరు మనబాధ్యత వంటి నినాదాలు పలికి అందరిచే నినదింపజేసారు. గ్రామ శ్రీరామమందిరం కూడలిలో నిర్వహించిన మానవహారంనుద్దేశించి ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, స్థానిక సచివాలయ విద్యా సంక్షేమ కార్యదర్శి ఆరెళ్ళ వేణుగోపాల్ లు మాట్లాడారు. అనంతరం పాఠశాల బాలబాలికలకు ఉప్మా, చట్నీలతో తేలికపాటి ఆహారం అందజేసారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, యు.ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్త కుప్పిలి లక్ష్మి, ఉరిటి సౌజన్య, బాలబడి బోధకురాలు దారబోయిన జ్యోతి, పాఠశాల ఆయా గుంటుబాని చిన్నమ్మడు తదితరులు హాజరయ్యారు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
good