(గురువులే జగద్గురువులే...)
=====================
ఆ రెండూ...
గురువులే...జగద్గురువులే..?
కాలం...
పాఠాలు నేర్పుతుంది...
జీవితం...
గుణపాఠాలు నేర్పుతుంది...
కాలం...
అది ఒక లోతైన కడలి...
జీవితం...
దానిలో ఎగిసిపడే
ఒక అలలాంటి ప్రయాణం...
కాలం...
కొనలేని కోహినూర్ వజ్రం...
గడిచిన ఏక్షణం మళ్ళీ తిరిగిరాదు...
జీవితం...
చాలా చిన్నది...చాలా విలువైనది...
తామరాకు పైన నీటిబుడగ లాంటిది...
ఏ క్షణాన జారిపోతుందో ఎవరికెరుక..?
కాలం...
ఒక చక్ర భ్రమణం...
పైకి...క్రిందికి...ముందుకు ప్రయాణం...
నేడు ఎవరెస్ట్ శిఖరంపై ఉన్నవాడు...
రేపు పాతాళంలోకి జారిపోవచ్చు...
కాలం...
కళ్లెంలేని గుర్రంలా...
మెరుపువేగంతో పరుగులు తీస్తుంది...
జీవితం...
ఒక పరిమళ భరిత పుష్పం...
నేడు చిగురిస్తుంది రేపు వాడిపోతుంది...
జీవితం...
ఒక పండిన పండు...
పండిపోతే ఏ క్షణమైనా నేలరాలవచ్చు...
జీవితం...
పంచభూతాల మిశ్రమం...
జననం...మరణమనే
రెండు ఘట్టాల సమ్మిళితం...
అది దైవాధీనం...
మృత్యువు ఎటువైపు నుండైనా
ఏ క్షణమైనా ముంచుకు రావచ్చు...
మట్టి నుండి పుట్టిన
మనిషి కన్నుమూస్తే కాటికే...
ఆపై కట్టైకాలక తప్పదు...
మళ్ళీ మట్టైపోవడం ఖాయం...
కాబట్టి
మనిషిగా పుట్టిన ప్రతి మనిషి...
కారాదు...మట్టి బొమ్మ...
గట్టి పట్టుదలే ఉంటే...
జీవిత పరమార్థం గ్రహిస్తే...
కాలం విలువ తెలుసుకుంటే...
కాగలడు భువిలో మరో బ్రహ్మ....
అన్నది ఓ సినీకవి "కాలజ్ఞాన" సారాంశం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి