శ్లోకం:
ఏకాన్తే సుఖ మాస్యతాం పరతరే
చేతస్సమాధీయంతాం
పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తత్భాధితం దృశ్యతాం !
ప్రాక్కర్మప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః
శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతా మథపరం బ్రహ్మ్తాత్మ
నా స్థీయతామ్ !!
భావం: శాంతియుత స్థానంలో మరియు ఏకాంత
పవిత్ర స్థానములు ప్రసన్నముగ కూర్చుండుము.
చంచల చిత్తమును సచ్చిదానంద సర్వాత్మ బ్రహ్మయందు స్థిరీకరింపుము. దశ దిక్కులలో
సంపూర్ణ ముగా నిండి ఉన్న ఏకమాత్మ పరమాత్మ
చింతన చేయుము. కల్పిత నామరూపాత్మక జగత్తుకు ఆధారము పరమాత్మనే తెలుసుకొని జగత్తుని తొలగింపుము. (అనగా సంసారిక కోరికలను మనస్సు నుండి తొలగింపుము) నిర్మల తత్వ జ్ఞాన ప్రభావముతో సంచిత కర్మలను నాశనము చేయుము. వివేకయుక్త బుద్ధి బలంతో మరియు కఠోర వాక్యములను పరిత్యజింపవలెను.
ఆగామి కర్మలతో సంబంధము తెంపుకొనుము. సంసారం కల్పితం అని తెలిసి కొన్నందున ఈ దేహం నుండి ప్రారంభ కర్మమును ఆనందముగా అనుభవింపుము. పిమ్మట ఈ పరిఛ్ఛిన్న ఆత్మను వ్యాపక బ్రహ్మమయము గావించి అరోక్షానుభూతితో స్థిరముగా ఉండవలయును.
ఏ సజ్జనుడు భగవత్పాద శంకరాచార్య విరచిత ఈ ఐదు శ్లోకములను అత్యంత శుద్ధ భక్తులతో చదువునో మరియు ఏకాగ్ర చిత్తముతో అను దినము మననము చేయునో(ఈ ఉపదేశ ఆచరణ వలన) అట్టివారు నిత్య శుద్ధ ముక్త స్వభావుడైన బ్రహ్మ యొక్క అహేతుక. కరుణ వలన సంసారం అని అడిగి దావనల ము వలన ఉత్పన్నమైన తాపత్రయముల నుండీ ప్రశాంతిని(అనగా ముక్తిని) పొందును.
*******
శ్రీ శంకరాచార్య విరచిత సాధనా పంచకము :- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి