సాహితి కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
==================
రాధ మందార మొక్కదగ్గరకు
వెళ్లి, ఆనందుతో చూసావా ?ఈ మొక్క నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు అంది.
ఆనంద్ నవ్వుతూ రాధను చేయిపుచ్చుకుని మొక్కల దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
చెట్లకి కూడా ప్రాణం ఉంది కదా .అవి కూడా పెరుగుతాయి. కొన్నాళ్ళు ఆగిన తర్వాత మరణిస్తాయి. అంది రాదా.
మనం పెంచిన మొక్క మనతో మాట్లాడుతుంది. మనలో ఉన్న పాజిటివ్ నెస్ ను అది గ్రహిస్తుంది. మనం దానిని ఎంత శ్రద్ధగా చూస్తే ,అంత సంతోషంగా మనకి ప్రతిఫలం ఇస్తుంది. చెట్టు ఏది తన దగ్గర ఉంచుకోదు. కాయలు, పూలు ,ఆకులు ఇలా ఏదో విధంగా మనిషికి ఉపయోగపడుతూనే ఉంది. మనం నీరు పోసి ఎరువులు వేసి పెంచితే ,చక్కగా యేపుగా పెరుగుతుంది. మన రుణం అది ఉంచుకోదు .మనం దగ్గరకు వెళ్లి మాట్లాడినప్పుడు దానిలో ఉన్న చైతన్య మనతో మౌన వ్యాఖ్య చేస్తుంది .దానికి నోరు లేకపోయినా అది మనతో సంభాషిస్తూ ఉంటుంది అన్నా డు ఆనంద్. నీవు మొక్కల మనసును బాగా అర్థం చేసుకున్నావు.
రా ధా నీ మాటలు వింటుంటే నాకు
సినీ కవి ఆకులో ఆకునై ,పువ్వులో పువ్వునై ,నును లేత రెమ్మనై యీడనే ఉండిపోనా అన్న కవిత గుర్తుకొస్తోంది .
మన ప్రాణంలో ప్రాణంగా, మన జీవితంతో ఏకీభవించి ఉన్నదే చెట్టు అవునా ఆనంద్ నాకు నాకు అదే అనిపిస్తోంది
అంది రాధా
ఇంతలో ఇంట్లో ఉన్న బామ్మ గారు బయటకు వచ్చి అవునే మీరిద్దరూ మాట్లాడిన మాటలు విన్నాను మీరు మాట్లాడింది యదార్థం అంటూ రాధ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది.
మన ప్రాణం లో ప్రాణం మొక్కలు:-రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి