మంచి మర్యాద…
మాటల్లో మాధుర్యం...
ఆలోచనలో పరిపక్వతలే...
విజయయాత్రకు...పునాదులు..!
పలికే ప్రతి పలుకులో
ఉప్పొంగాలి ప్రేమలు
అనురాగాలు ఆప్యాయతలు
అవే విజయానికి...సోపానాలు..!
చెప్పేది ఓపికతో శ్రద్ధగా ఆసక్తిగా
వినడమే...విశ్వవిజేత విజ్ఞత..!
నిర్భయంగా...
నిష్పక్షపాతంగా...
నిర్మోహమాటంగా
నిప్పులాంటి
నిర్ణయాలు తీసుకోవడమే...
విశ్వవిజేత...విశిష్ట లక్షణం...!
అల్లకల్లోల పరిస్థితుల్లో
సైతం నిర్మలంగా నిశ్చలంగా
నిశ్చింతగా ఉంటూ స్థితప్రజ్ఞత
ప్రదర్శించే వాడే...విశ్వవిజేత..!
పెక్కు చిక్కు
ముళ్ల ప్రశ్నలకు
చిరునవ్వుతో
సమయస్ఫూర్తితో
సమాధానాలివ్వడమే
విశ్వవిజేత...విజయరహస్యం..!
వినయ విధేయతలతో
వివేకంతో విచక్షణతో విశ్రమించక
అనుకున్న లక్ష్యాల్ని చేధించి...
ఆవలితీరం చేరే వాడే...విశ్వవిజేత..!
ఇవే ఇవే నిజమైన
విశ్వవిజేత...విశిష్ట లక్షణాలు...
ఇవి అన్న పోలన్న
పలికిన అమృత వాక్కులు..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి