ఆకాశము మీద
అది నెలవంక
నెలవంకలోన
నెలల పాపాయి
రోజు రోజు లోన
ఎదుగుతుందా పాప
నెలపొడుపున ఆడుతూ
నేలనేమొ చూస్తుంది
తరవాత రోజు
విదియ చూపుతూ
తదియలోకి వచ్చి
చవితిని తాకుతుంది
పంచమి పర్వదినం
షష్టి చక్కటి దినం
సప్తమి మంచి రోజు
అష్ట నవమి చూపి
దశమిలో అడిగిడి
ఏకాదశి కి వెళ్తూ
ద్వాదశలో చేరి
త్రయోదశి గెలుస్తుంది
చతుర్దశి చదరంతో
నిండు పౌర్ణమి నాడు
అందమైన చందమామ
అవని నుదుట తిలకం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి