పుట్టినరోజు కానుకగా మొక్కల బహూకరణ

 ప్రముఖ పారిశ్రామికవేత్త, పి ఎస్ ఎన్ గుప్తా పెట్రోల్ బంక్ అధినేత పొట్టా సత్యన్నారాయణ గుప్తా 57వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజాం పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సభ్యులంతా పుట్టినరోజు కానుకగా మొక్కలను బహూకరించారు. సమితి కన్వీనర్ ఆర్.వి.జె.నాయుడు మాట్లాడుతూ సత్యనారాయణ గుప్తా అక్షర యజ్ఞం అధినేతగా పర్యావరణ పరిరక్షణ కోసం, సామాజిక చైతన్యానికి గావించిన సేవలను గుర్తుచేస్తూ కొనియాడారు. సత్యన్నారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రతి శుభకార్యానికి శుభాకాంక్షల కానుకలుగా మొక్కలను బహూకరిస్తూ, విధిగా మొక్కలు నాటుట వంటి ఆదర్శం సమాజంలో అలవడాలని అన్నారు. తనకు శుభాకాంక్షల రూపంలో మన ప్రత్రక్ష దైవాలవంటి మొక్కలను అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన  పురస్కార గ్రహీత పెంకి చైతన్య కుమార్, నాటక రంగ ప్రభుత్వ నంది పురస్కార గ్రహీత శాసపు సత్యనారాయణ, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, ప్రముఖులు ఎ.బాలమురళీకృష్ణ, డోల వాసుదేవరావు, పి.ఈశ్వరరావు, బి.వి.శ్రీరామమూర్తి, వి.సన్యాసినాయుడు తదితరులు పాల్గొని, గుప్తాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు