యోగోత్సవం…:- -ఎస్.వి.రమణా చార్య

 తనువు,మనసూ ఆత్మను ఏకం చేసే మేటి సాధనం
ఏకాగ్రత సాధనకు మార్గదర్శి
శ్రద్ధ,,అవగాహనల సమ్మేళిత సారమే సూర్యనమస్కారం
ఒత్తిడి,భావోద్వేగాల తీవ్రతను అణిచి వేసేదే యోగం
సకల మానవ జీవులకు మేలు కొలుపు సూర్యుడే
అందుకే యోగను ఆచరిద్దాం
ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేద్దాం
ఓంకార బిందు సంయుక్తమే 
యోగలో దాగివున్న మంత్రం
సర్వరోగ నివారణం
సూర్య నమస్కార స్తోత్రం
చీకట్లను పారద్రోలుతూ వెలుగులను ప్రసరించే వాడు సూర్యుడే
కనిపించే దైవమ్ సూర్యుడే
మృతువును జయింప చేసేదే మన యోగశాస్త్రం
వసుదైక కుటుంబకం
అంటూ ప్రపంచ సీమకు చెప్పుదాం
నేడు విశ్వవ్యాప్త పండుగ రోజు
భారత దేశం అందిస్తున్న సందేశం
భవిష్యత్ తరాలకు ఆశాదీపం
యోగ ఓ మతంకాదు
వ్యాయామాల సాధనాల సమాహారం
లోకసమస్తా సుఖినో భవంతు 
అంటూ భారతీయత వైభవం ఎలుగెత్తి చాటుదాం

కామెంట్‌లు