అమెరికా ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పున గాల్లాటిన్:- -ఎస్.వి.రమణా చార్య,జర్నలిస్ట్

 ప్రపంచ వ్యాప్తంగా అమెరికా డాలర్ చాలా ప్రసిద్ధి చెందిన విషయం మనకు తెలిసిందే.అమెరికన్ డాలర్ లో ఆల్బర్ట్ గాల్లాటిన్ కనిపించక పోయినా ప్రతీ డాలర్ వెనుక ఉన్న ఆర్ధిక సిద్దాంతాలలో ఆల్బర్ట్ గాల్లాటిన్ కృషి దాగి ఉంది.ఇంతకూ ఎవరు వీరు అనుకుంటున్నారా. అమెరికన్ ఆర్థిక చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తి ఆల్బర్ట్ గాల్లాటిన్.అమెరికా ఖజానా శాఖ (ట్రెజరీ డిపార్ట్ మెంట్)ను బలంగా మలచిన మహాత్ముడు. ఆతని సేవలు కేవలం గణాంకాలలోనే కాదు పాలనా ప్రజాస్వామ్యం, అభివృద్ధి,శాంతి ప్రణాళికలతో ప్రతిబింబించాయి.
   ఆల్బర్ట్ గాల్లాటిన్ 1801 నుంచి 1814 వరకు అమెరికా ట్రెజరీ కార్యదర్శిగా పనిచేశారు. 1761లో స్విట్జర్లాండ్ లో జన్మించిన గాల్లాటిన్ చిన్నతనం లొనే అమెరికా వలస వచ్చారు.అమెరికన్,ఇండియన్ భాషలపై పరిశోధన చేశారు. అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ సభ్యునిగా,భాషా సంస్కృతి అభివృద్ధికి కృషి చేశారు.న్యూయార్క్ విశ్వవిద్యాలయం లో ఈయన పేరుతో Gallatin school of Individualized study ని ఏర్పరిచారు. బహుభాషా పండి తుడైన గాల్లాటిన్ రాజకీయ ప్రవేశం చేశారు.వాషింగ్టన్ యుగం తర్వాత ప్రజాస్వామ్య భావజాలానికి కృషి చేశారు. ముఖ్యంగా ఫెడరలిస్టుల అధిక ఖర్చు విధానాన్ని వ్యతిరేకించారు.ప్రభుత్వాలు ఖర్చులను ఎలా తగ్గించాలో చూపించారు.తక్కువ ఖర్చుతో ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలను ఎలా మెరుగు పరచాలన్నది గాల్లాటిన్ సిద్ధాంతం.
  1803లో అమెరికా ఫ్రాన్స్ నుండి లూసియానా భూ భాగాన్ని కొనుగోలు చేసింది.ఈ భారీ వ్యయానికి ఆర్థిక వ్యూహాలను రూపొందించినవారు గాల్లాటినే Report on roads and canals ఆర్థిక మ్యానిఫెస్టో ద్వారా వాణిజ్య మార్గాల విస్తరణకు గాల్లాటిన్ దారులు వేశారు.ఇది అమెరికాలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు మూలాధారంగా మారింది.1812లో బ్రిటన్ తో యుద్ధం ముగించడానికి గాల్లాటిన్ దౌత్యం చేశారు.ప్రభుత్వాల కోసం గాల్లాటిన్ తన శైలిలో కొన్ని ముఖ్యమైన సూత్రాలు చెప్పారు.
ఖర్చులను నియంత్రించుకోవటం, అభివృద్ధి కి వ్యూహాత్మక ఖర్చులు,ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు మార్గదర్శ పాలన ఎలా చేయాలి.శాంతిని,అభివృద్ధి తో ఎలా అనుసంధానం చేయాలో గాల్లాటిన్ వివరించారు.ఆయన చెప్పిన సూత్రాలతో ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి దేశాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఆర్థిక పండితులు చెబుతున్నారు.

కామెంట్‌లు