సుప్రభాత కవిత : -బృంద
అందమైన చక్కని చిన్నిపువ్వులతో
చిక్కగా నేసిన రత్న కంబళిపై రవి
అడుగులు పడితే మురిసి పోవాలని
అవని తల్లికి అంతులేని కోరిక!

వెలుగు వర్షించు సిరులు నిండ 
కలుగు జగతికి క్షేమములు
కాంతి ధారలందు లోకము తడిసి
శాంతి  దారుల సాగు కాలము

ఉదయ రాగాల సడులు 
హృదయాన్ని కదిలింప 
రవళించు గానమే రమ్యమై 
పరిమళించు భావమ్ము పచ్చగా!

కనులు కలలు కన్న
కమ్మని కల్పనే 
కమనీయ శిల్పమై 
తనివి తీర్చు వేళ...

ఆశలు తీరే సంకేతములతో 
ఆత్రముగా నిరీక్షించు మదికి 
అనువైన కబురేదో పట్టితెచ్చి 
అమర సందేశము అందించునేమో!

జీవన మకరందము గ్రోల 
మనసు మధువనం కాగా 
మంచి కబురులన్నీ కలిసి 
మధుపగానము పాడ 

ఏతెంచు వెలుగుల విభునికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు