ఈ సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి మనిషి జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. పెద్దలకే కాదు, ఇప్పుడు పిల్లలు కూడా మొబైల్ వాడకానికి అలవాటుపడుతున్నారు. అయితే, ఈ అలవాటు పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. చిన్న వయస్సులోనే పిల్లలు గేమ్స్, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా వంటివి చూసే అలవాటుతో చదువుపై దృష్టి పోగొట్టుకుంటున్నారు.
మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల పిల్లల్లో దృష్టిదోషాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శారీరక చైతన్యం తగ్గిపోవటంతో పాటు, సహజ సామాజిక పరస్పర సంబంధాలు బలహీనపడతాయి. మాటలాడటం, భావప్రకటన, భావనలను పంచుకోవడం వంటి సామాజిక నైపుణ్యాలు తక్కువవుతాయి. ఇది వారిలో ఒంటరితనాన్ని పెంచే ప్రమాదం కలదు.
పిల్లలు ఎక్కువసేపు మొబైల్‌లో గడిపితే చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రత హరించబడుతుంది. పదే పదే నోటిఫికేషన్లు రావడం వల్ల గమనశక్తి దెబ్బతింటుంది. ముఖ్యంగా శిశువయసు నుంచి ప్రాధమిక పాఠశాల దశలోని పిల్లల మెదడు అభివృద్ధికి ఇది హానికరం. భవిష్యత్తులో వారు ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యంలో వెనుకబడే అవకాశముంది.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల జాగ్రత్తలు అత్యవసరం. మొబైల్ వినియోగాన్ని నియంత్రించాలి. పిల్లలకు ఆటలతో, పుస్తకాలతో, సంగీతంతో, ప్రకృతితో మమేకమయ్యే అవకాశాలు కల్పించాలి. రోజువారీ క్రమానుసారంగా చదువుకి, ఆటకి, విశ్రాంతికి సమయాన్ని కేటాయించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులే మొదటగా మొబైల్ వినియోగంలో ఆదర్శంగా ఉండాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి