‌ పచ్చని ప్రేమ!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
పగిలిన మనసులు స్వర్గంలో దొరుకుతాయి 
అతికిన మాటలు నరకంలో దొరుకుతాయి. 

విరిగిన రంగులు విశ్వమంతా పూస్తాయి 
స్నేహమనే చేయమంతులు శ్రీమంతుల ఇళ్లల్లో దొరకవు. 

ఆత్మీయ ఆలింగనం అంగళ్లలో దొరకదు 
నిశ్శబ్దంలోనే నేర్చుకుంటాం నిశ్శబ్దంలోనే నేర్పుతాం 
నిశ్శబ్దంలోనే ప్రేమిస్తాం!!

అనురాగపు బంధం మన చుట్టూ చంద్రునిలా తిరుగుతుంది. 

తిరగబడ్డ భూమి తిరగబడుతుంది కానీ తిరిగి తిరగబడదు. 

నీతి నిత్యం సత్యం పలుకుతుంది అది అందరి ముందు హత్య చేయబడుతుంది. 

ఆదర్శం ధర్మశాల లాంటిది అది అందరి నివాసం. 
ధర్మం స్వర్ణ కంకణం అది చేతులను బంధించదు 

కర్మ కలల్లో కానరాదు నిర్మాణాల్లో నిద్ర లేపుతుంది. 

గర్వం పూర్వం ఒక పురాణం ఇప్పుడు ఒక హెచ్చరిక. 

పచ్చి నిజం చచ్చిపోయింది పచ్చని ప్రేమను ప్రసవించింది. 
అచ్చం అమ్మలాగా ఒక సంతోషం నేను అచ్చం అక్కలాగా ఒక దుఃఖం ముఖం నేను.

బహుముఖ ప్రజ్ఞాశాలి గద్వాల సోమన్నకు ప్రేమతో. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు