పిచ్చికోపంతో రెచ్చిపోకు...మిత్రమా..!: - కవిరత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
నేడు పిచ్చికోపంతో 
రెచ్చి పోతావ్... 

రేపోమాపో 
నీ అంతరంగాన చెలరేగి
దహించే ఆలోచనల 
అగ్ని జ్వాలల్లో 
దగ్దమైపోతావ్... 
పిచ్చివాడవైపోతావ్...
చచ్చిపోతావ్...
ఏం లాభం...? మిత్రమా...

నేడు పిచ్చికోపంతో 
రెచ్చి పోతావ్... 
నిన్నటి వరకు 
నీ ప్రాణస్నేహితుడని
నేడు బద్ద శత్రువని
కడుపులో కక్ష పెంచుకుని 
పీక నొక్కేస్తావు ప్రాణాలు తీస్తావ్...
కసితీరా పాతాళానికి తొక్కేస్తావ్... 

రేపోమాపో 
నీ మనస్సాక్షి మంటల్లో 
పడి మాడి మసైపోతావ్...
మానసిక రోగివైపోతావ్...
మాయమైపోతావ్...
ఏం లాభం..? మిత్రమా...

"నీ కోపమే నీకు శత్రువు
"నీ శాంతమే నీకు రక్ష 
"నీ దయ నీకు చుట్టంబౌ "...
అన్న వేమన్న పద్యం వేలసార్లు 
చదివి ఏం లాభం..? మిత్రమా...

అంతరంగంలోని
కామ క్రోధ లోభ మోహ మద 
మాత్సర్యాలను అరిషడ్వర్గాలను 
నీ అదుపులో ఉంచుకోకపోతే... 
ఏం లాభం...? మిత్రమా...

అన్నీ చిక్కులే చింతలే చీకట్లే... 
నీ జీవితమంతా తీరని ఇక్కట్లే...
అందుకే...
ఓ మిత్రమా...నా ప్రియ నేస్తమా...
వద్దు వద్దు కోపం క్రోధం కసి కక్ష వద్దు ...
శాంతం సహనం సమాధానమే ముద్దు...



కామెంట్‌లు