యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,
ప్రత్యాహార,ధారణ, ధ్యాన, సమాధి అనేవి మన పతంజలి ఋషి వర్యుని
అమూల్య అష్టాంగయోగాలు
వీటిని ప్రపంచానికి ప్రసాదించిన
పతంజలి మహర్షికి మనం ఋణపడి ఉన్నాం
కాయము ఆత్మనికాయము అందుకే,
ఆత్మ పరమాత్మల అనుసంధానానికి
యోగా విధానాలు సుగమమార్గాలు
మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే
మహర్షి అద్భుత తపోఫలాలు
మతిని శృతిచేసి, శరీరాన్ని సరిచేసి
ప్రకృతి కృతిగా మానవులను జతచేసి
నిశ్చల ధ్యానంతో ఏకాగ్రతనుపొంది
మనసును శరీరాన్ని రోగ రహితంగా
సుదృఢపరుస్తూ, స్థితప్రజ్ఞను అందించే
మోక్షసాధక కరదీపిక ఇది
వసివాడని వన్నెచెడని
భరతమాత నుదుటి సిందూరమిది!!
**************************************
కరదీపిక ::- డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి