సర్కార్ బడి పిలుస్తుంది
పలకా బలపం పట్టండి
తోటి పిల్లలను పిలవండి
పరుగులు తీసి ఉరుకండి
పాఠశాలలో మీరాగండి
ప్రార్థన చేసి మీరంతా
తరగతి గదికీ వెళ్ళండి
వాణికి దండం పెట్టండి
గురువుకు మీరు మ్రొక్కండి
దరువుతో అందరు చదవండి
శిక్షణ పొందిన గురువులు
విద్యను చక్కగా బోధిస్తారు
శ్రద్ధతో బాధ్యతగా చదవండి
ముద్దుగా మీరెదగండి
బుద్ధిమంతులై మెదలండి
దేశానికి ఎల్లలై నిలవండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి