పువ్వమ్మ పువ్వమ్మ పువ్వమ్మా
ఎందుకు నీకంత సిగ్గమ్మా
చెట్టుకు చక్కన నీవమ్మా
తోటకు కమ్మన నివ్వమ్మా ||పువ్వమ్మ||
అందంతోటి అలరిస్తావు
అందరిమదులు దోచేస్తావు
రంగులతొటి ఆకర్షిస్తావు
హంగులతోటి ఆనందపరుస్తావు ||పువ్వమ్మ||
కాంతులాను వెదజల్లుతావు
ప్రశాంతతను చేకూరుస్తావు
పరిమళాలను చల్లుతావు
పరిసరాలను మురిపిస్తావు ||పువ్వమ్మ||
తేటులాను పిలుస్తావు
తేనెచుక్కలు అందిస్తావు
ప్రేమకోర్కెను పుట్టిస్తావు
విరహబాధను కలిగిస్తావు ||పువ్వమ్మ||
ముందు మొగ్గగా పుడతావు
పిమ్మట విరిగా విచ్చుకుంటావు
మొదట పిందెగా మారుతావు
తర్వాత కాయగా రూపుదిద్దుకుంటావు ||పువ్వమ్మ||
దండగా అల్లమంటావు
దేవుళ్ళమెడన వెయ్యమంటావు
కోమలాంగుల కొప్పులెక్కుతావు
చక్కదనాలను రెట్టింపుచేస్తావు ||పువ్వమ్మ||
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి